Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరిగిలో అమ్మను చంపేసిన కొడుకు.. ఎందుకో తెలుసా

పరిగిలో అమ్మను చంపేసిన కొడుకు.. ఎందుకో తెలుసా
, శనివారం, 25 సెప్టెంబరు 2021 (11:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా ప‌రిగి మండ‌లం ఖుదావాన్‌పూర్‌లో దారుణం జ‌రిగింది. ప్రభుత్వం ఇచ్చే పింఛ‌ను డ‌బ్బుల కోసం త‌ల్లిని చంపాడో కిరాతక కొడుకు. నవమాసాలు పెంచిన కన్న తల్లి భీమ‌మ్మ‌(62) గొంతును విద్యుత్ తీగ‌తో నులిమి హ‌త్య చేశాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బ‌ల‌వంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగా కోడలు ఉపాస‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌తో... సాయి ధ‌ర‌మ్ తేజ్ సేఫ్