Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ద‌య గ‌ల ఉమా... గాయపడిన వ్యక్తిని తన కారులో ఎక్కించుకుని..

Advertiesment
ద‌య గ‌ల ఉమా... గాయపడిన వ్యక్తిని తన కారులో ఎక్కించుకుని..
విజయవాడ , శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (16:28 IST)
ద‌య‌లేని ఉమ అంటూ, ఆర్జీవీ త‌న సినిమాలో టీడీపీ నాయ‌కుడు దేవినేని ఉమ‌ను చూపించారు. కానీ, త‌ను ద‌య గ‌ల ఉమ అని దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు నిరూపిస్తున్నారు. ఆయ‌న మ‌రోసారి త‌న  మానవత్వం చాటుకున్నారు. యాక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తిని తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రిలో చేర్పించారు. 
 
ప్రకాశం బ్యారేజ్ మీద బైక్ మీద వస్తున్న విజయవాడ కృష్ణలంక కు చెందిన శ్యామల వెంకట్ రెడ్డి  యాక్సిడెంట్ జరిగి గాయాలపాలయ్యాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్నమాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ సంఘటనను చూసి వెంటనే స్పందించారు. హుటాహుటిన వెంకటరెడ్డిని స్వయంగా తన కారులో ఎక్కించుకుని విజయవాడ గ్లోబల్ హాస్పిటల్ కు తీసుకు వెళ్లి జాయిన్ చేశారు. డాక్టర్ల తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించి వెంకట రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 
 
గతంలో కూడా పలుసార్లు బాధితులను ఆదుకున్న ఘటనలను గుర్తు చేస్తూ స్థానికులు దేవినేని ఉమా  సేవలను కొనియాడారు. రోడ్డు పక్క ప్రమాదంలో ఉన్న వ్యక్తిని తన షెడ్యూల్ పక్కనపెట్టి కారులో ఎక్కించుకొని స్వయంగా ఆస్పత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే వరకు ఆయన తీసుకున్న శ్రద్ధ పట్ల వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు దేవినేని ఉమ కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఉమా వారికి అండగా ఉంటానని ఏదైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో ప్రధాని మోడీ బస చేసిన హోటల్ ప్రత్యేక ఏంటో తెలుసా?