Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ టీ20 సీజన్లో షేర్ చాట్ అందిస్తోంది సంపూర్ణ క్రికెట్ అనుభూతి

ఈ టీ20 సీజన్లో షేర్ చాట్ అందిస్తోంది సంపూర్ణ క్రికెట్ అనుభూతి
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (19:05 IST)
క్రీడలను అభిమానించే భారతదేశం వంటి దేశంలో క్రికెట్ రారాజుగా ఉంది. అలాంటి చోట షేర్ చాట్ రాబోయే క్రికెట్ టోర్నమెంట్స్ కోసం స్కోర్ బోర్డ్‌ను, బాల్ టు బాల్ కామెంటరీని మిళితం చేసేలా ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఎనిమిది ప్రాంతీయ భాషల్లో దీన్నిఅందించనుంది.
 
తన ఆడియో చాట్ రూమ్ ఫీచర్ సాయంతో ఈ వేదిక సమగ్ర సోషల్ క్రికెట్ అనుభూతిని అందించేందుకు గాను వీరేందర్ సెహవాగ్, రవిచంద్రన్ అశ్విన్, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, అజిత్ అగార్కర్, ఆకాశ్ చోప్రా లాంటి కీలక ఆటగాళ్లతో చాట్ రూమ్ సెషన్స్ నిర్వహిస్తోంది. 180 మిలియన్లతో కూడిన పటిష్ఠమైన షేర్ చాట్ కమ్యూనిటీ ఇప్పుడు మ్యాచులు, పనితీరు, ఇతర కీలక మూమెంట్స్ గురించి తమ అభిమాన ఆటగాళ్లతో చర్చించే అవకాశాన్ని పొందనుంది.
 
భారతదేశ అతిపెద్ద ఇండిక్ లాంగ్వేజ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌గా షేర్ చాట్ ఉన్న నేపథ్యంలో ఈ ఫీచర్లు ఎనిమిది విభిన్న భాషల్లో (తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, బంగ్లా, మరాఠీ, పంజాబీ, మలయాళం) అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన ఫీచర్ భారతదేశ వ్యాప్తంగా ప్రజలు గతంలో ఎన్నడూ లేనంతగా రియల్ టైమ్‌లో స్వేచ్ఛగా తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది.
 
దానికి అదనంగా క్రికెట్ అభిమానులు లైవ్ మ్యాచెస్ సందర్భంగా తమ టీమ్ చాట్ రూమ్స్ ద్వారా ఇతర అభిమానులతో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. క్రికెట్ వినోదంలో మునిగితేలవచ్చు. ఈ సందర్భంగా షేర్ చాట్ సీనియర్ డైరెక్టర్ (కంటెంట్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్) శశాంక్ శేఖర్ మాట్లాడుతూ, ‘‘క్రికెట్ ఎప్పుడూ భారతదేశానికి గుండెకాయగా ఉంటోంది. ప్రాంతాలు, భాషలు, సంస్కృతులకు అతీతంగా కో ట్లాది మంది భారతీయ అభిమానులను అనుసం ధానం చేసే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడల్లో ఇది ఒకటి.
 
వినూత్న అనుబంధాలు, సామాజిక అనుభూతులతో మా వినియోగదారులకు వినోదం అందించాలన్నది షేర్ చాట్ లక్ష్యం. అంతేగాకుండా షేర్ చాట్ ఆడియో చాట్ రూమ్ ప్రజాదరణను పెంచుకుంటోంది. మా యూజర్, క్రియేటర్ కమ్యూనిటీలో అతిపెద్ద ఎంగేజ్మెంట్ ఫీచర్‌గా ఆవిర్భవిస్తోంది. మ్యాచ్ అప్‌డేట్స్, విశ్లేషణలకు సంబంధించి మనం మన కమ్యూనిటీతో సంభాషించేందుకు క్రికెట్ నిపుణులను కూడా కలిగి ఉన్నందున, క్రీడా ఈవెంట్స్‌కు పూర్తిగా నూతన సామాజిక అనుభూతులను క్రియేట్ చేసేందుకు చూస్తున్నాం’’ అని అన్నారు. 
 
షేర్ చాట్ ఆడియో చాట్ రూమ్ అనేది ఈ వేదికకు అత్యంత ముఖ్యమైన ఫీచర్‌గా మారిపోయింది. నెలకు 2 బిలియన్లకు పైగా నిమిషాల స్ట్రీమ్‌తో ఇది భారతదేశ అతిపెద్ద లైవ్ ఆడియో ప్రొడక్ట్‌గా మారిపోయింది. ఇటీవలి వారాల్లో అక్షయ్ కుమార్, భువన్ బామ్, ప్రఖ్యాత కవులు, గాయకులతో ఎంగేజ్మెంట్‌తో సహా ఎన్నో చాట్ రూమ్‌లు భారీసంఖ్యలో వీక్షకులను పొందుతున్నాయి. ఇవే గాకుండా యూజర్ల మధ్య దీన్ని అతి పెద్ద ఎంగేజ్ మెంట్ సోర్సెస్‌లో ఒకటిగా చేయడం ద్వారా  చాట్ రూమ్ సెషన్స్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లే యోచనలో కూడా షేర్ చాట్ ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండుగ సీజన్‌లో అమెజాన్ ఇండియా 110,000 కన్నా ఎక్కువ సీజనల్ ఉద్యోగ అవకాశాలు