Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పండుగ సీజన్‌లో అమెజాన్ ఇండియా 110,000 కన్నా ఎక్కువ సీజనల్ ఉద్యోగ అవకాశాలు

Advertiesment
పండుగ సీజన్‌లో అమెజాన్ ఇండియా 110,000 కన్నా ఎక్కువ సీజనల్ ఉద్యోగ అవకాశాలు
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (18:48 IST)
పండుగ సీజన్‌ సమయంలో, తన కార్యకలాపాల నెట్‌వర్క్‌లో 110,000 కన్నా ఎక్కువ సీజనల్ ఉద్యోగ అవకాశాలను సృష్టించామని అమెజాన్ ఇండియా నేడు ప్రకటించింది. అర్ధవంతమైన పనిని సృష్టించాలన్న తన నిబద్ధతకు అనుగుణంగా, భారతదేశ వ్యాప్తంగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాలను ముంబయి, దిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్, కోలకతా, లక్నో మరియు చెన్నై తదితర నగరాల్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది.
 
ఈ నియామకాల్లో ఎక్కువ భాగం అమెజాన్‌లోని ప్రస్తుత అసోసియేట్స్ నెట్‌వర్క్‌లో చేరాయి మరియు వినియోగదారుల ఆర్డర్‌లను సురక్షితంగా మరియు సమర్ధవంతంగా పికప్ చేసుకునేందుకు,  ప్యాక్ చేయడానికి, షిప్పింగ్ చేసేందుకు మరియు వితరణ చేసేందుకు వారికి మద్దతు ఇస్తోంది. ఈ కొత్త నియామకాల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌లు కూడా ఉండగా, వీరిలో కొందరు వర్చ్యువల్ కస్టమర్ సర్వీస్ మోడల్‌లో భాగంగా, ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని వినియోగించుకోనున్నారు.
 
ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు భారతదేశంలో ఈ నెల మొట్టమొదటి కెరీర్ డేలో భాగంగా ఇటీవల ప్రకటించిన 8,000 ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు ఇందులో కలిసి ఉన్నాయి. ఈ సీజన్ ఆధారిత అవకాశాలు 2025 నాటికి దేశంలో 1 మిలియన్ కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించే అమెజాన్ ఇండియా నిబద్ధతకు మరొక ముందడుగు అని చెప్పవచ్చు.
 
‘‘ఈ పండుగ సీజన్‌లో దేశ వ్యాప్తంగా వినియోగదారులు అమెజాన్‌పై ఉంచిన విశ్వాసానికి, వారి ఆర్డర్లకు సురక్షిత, విశ్వసనీయత మరియు వేగవంతంగా వితరణ చేయడంపై విశ్వాసాన్ని ఉంచింది. దీనికి 110,000 అదనంగా వచ్చి చేరుతున్న సిబ్బంది మా ఫుల్‌ఫిల్‌మెంట్, డెలివరీ మరియు వినియోగదారుల సేవా సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు మరియు వినియోగదారునికి అసాధారణ అనుభవాన్ని ఇచ్చేందుకు మాకు సహకరించనున్నారు.
 
ఈ నియామకాలు వేలాది వ్యక్తులకు జీవనోపాధి మరియు ఆర్థిక స్వాతంత్ర్యం అందించడంలోనూ మద్ధతు ఇస్తోంది. వైవిధ్యత, సమానత్వం మరియు ఇన్‌క్లూజన్ మా అన్ని ప్రయత్నాలకు కేంద్ర స్థానంలో ఉండగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు భారతదేశ వ్యాప్తంగా వినియోగదారులకు మరియు విక్రేతలకు ఆనందదాయక పండుగ సీజన్ అందించేందుకు మద్ధతు ఇవ్వనుంది’’ అని’’ అమెజాన్ కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆపరేషన్స్, ఎపిఎసి, ఎంఇఎన్ఎ మరియు ఎల్ఎటిఎఎం ఉపాధ్యక్షుడు అఖిల్ సక్సేనా తెలిపారు.
 
కంపెనీ దివ్యాగులకు, మహిళలు, మాజీ సైనికులు మరియు ఎల్‌జిటిబిక్యూఐఏ వంటి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న సముదాయాలకు అవకాశాలను సృష్టించుందుకు శ్రమిస్తోంది. ఈ ఏడాది సీజన్ ఆధారిత నియామకాలను వీరందరితో కూడిన సిబ్బంది ద్వారా మరింత బలోపేతం చేసుకోగా ఇందులో 50% మేర మహిళలు, 60% మేర దివ్యాంగులు మరియు నిరుటి కన్నా 100% ఎల్‌జిబిటిక్యూఏఐ+ ప్రాతినిధ్యాన్ని వృద్ధి చేసి బలోపేతం చేశారు.
 
‘‘నేను ఇటీవల అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌లో పని చేయడాన్ని ప్రారంభించగా, అక్కడ నేను వినియోగదారుల ఆర్డర్లను ప్యాక్ చేస్తాను. ఈ భవంతిలో పని చేస్తున్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం మరియు సురక్షతకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. నా కుటుంబానికి మద్ధతుగా నిలుస్తున్నందుకు నేను చాలా సంతోషాన్ని కలిగి ఉన్నాను’’ అని అమెజాన్ ఇండియాలో ఇటీవలే సీజన్ ఆధారిత నియామకంలో చేరిన జోయాశ్రీ సమంతా పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌ని వదిలేసి తెలంగాణకు వచ్చేస్తా.. జేసీ దివాకర్ రెడ్డి