Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమేజాన్ యాపిల్ డేస్ సేల్.. ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్‌పై రూ.9వేల తగ్గింపు

Advertiesment
అమేజాన్ యాపిల్ డేస్ సేల్.. ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్‌పై రూ.9వేల తగ్గింపు
, మంగళవారం, 13 జులై 2021 (21:34 IST)
Apple Days sale
ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ తన సైట్‌లో యాపిల్ డేస్ సేల్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ మంగళవారం ప్రారంభం కాగా జూలై 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా యాపిల్‌కు చెందిన పలు ప్రొడక్ట్స్‌పై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఐఫోన్ 11, 12 సిరీస్‌లకు చెందిన ఫోన్లను ఈ సేల్‌లో తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
 
అమేజాన్‌లో ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్ రూ.70,900కు అమ్ముడవుతుండగా దీనిపై రూ.9000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో అదనంగా మరో రూ.6000 డిస్కౌంట్ ను ఇస్తారు. దీంతో భారీ తగ్గింపు ధరకు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మొత్తం రూ.15వేల డిస్కౌంట్ లభిస్తుంది.
 
ఇక ఐఫోన్ 11, 12 సిరీస్ ఫోన్లపై అద్భుతమైన ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తున్నారు. ఐప్యాడ్ మినీ, మాక్‌బుక్ ప్రొలపై కూడా యాపిల్ డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్ యాపిల్ డేస్ సేల్‌లో కొనుగోలు చేసే ఉత్పత్తులపై వినియోగదారులు 15 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడు గ్రామ వాలంటీర్.. అంతే అతడి సాయంతోనే భర్తను చంపేసింది..