Publish Date: Thu, 10 Jun 2021 (19:53 IST)
Updated Date: Thu, 10 Jun 2021 (19:55 IST)
దేశమంతటా కొత్తగా 'స్కూల్ ఫ్రమ్ హోమ్' సర్వసాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలో Amazon.in నేడు 'School from Home' స్టోర్లోను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ స్టోర్, ఇంటి వద్దనే ప్రభావవంతమైన విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సహకరించే, విద్య, వ్రాత కోసం అవసరమైన ఉత్పత్తులు, స్టేషనరీ, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, మొబైల్ ఫోన్లు, పిసిలు, బెడ్సెట్లు మరియు స్పీకర్లు, అమెజాన్ ఉపకరణాలు, ప్రింటర్ మరియు హోమ్ ఫర్నిషింగ్ వంటి పలు సామాగ్రులతో కూడిన విస్తృత శ్రేణిని ఆఫర్ చేస్తోంది.
అమెజాన్ షాపంగ్ యాప్ (యాండ్రాయిడ్ మాత్రమే) పై అలెక్సాను ఉపయోగించి స్వరంతోనే కస్టమర్లు స్టోర్‌ను సులభంగా చేరుకుని, అందులో సంచరించగలుగుతారు. యూజర్లు, యాప్ పై ఉన్న మైక్ ఐకన్ను ట్యాప్ చేసి, - 'అలెక్సా, గో టు స్కూల్ ఫ్రమ్ హోమ్ స్టోర్' అని చెబితే చాలు, దేన్ని క్లిక్ చేయకుండానే స్టోర్‌లోకి చేరుకుని, పాఠశాల కోసం అవసరమైన ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు మరియు పిసిలు, హెడ్సెట్లు మరియు స్పీకర్లు, అమెజాన్ ఉపకరణాలు, ప్రింటర్, స్టడీ టేబుళ్ళు మరియు కుర్చీలు, ఇంకా మరెన్నో వస్తువుల పై ఆఫర్లను పొందవచ్చు.