సైబర్ నేరగాళ్లు పెచ్చరిల్లిపోతున్నారు. తాజాగా ఆన్ లైన్‌లోకి చొరబడి ఖాతా ఖాళీ చేస్తున్నారు. తాజాగా కేటుగాళ్లు మరో అడుగు ముందుకేసి యాప్‌లల్లోకి కూడా చొరబడ్డారు. నకిలీ యాప్స్‌ను క్రియోట్ చేసి వాటి నుంచి డేటా లాగుతున్నారు.
ఇలా హ్యాకర్లు దేనిని వదలకుండా ధనార్జనే ధ్యేయంగా అమాయకులను బుట్టులో వేసుకుంటున్నారు. ఏది నిజమైన యాప్స్, ఏవి కావో తెసుకోలేని పరిస్థతి నెలకొంది. వీటితో పాటు కొత్తగా స్పామ్ యాప్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అయితే వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ ప్లేస్టోర్ కొత్త నిబంధనలను తీసుకురానుంది. ఈ గైడ్‌లైన్స్ 2021 చివరి నాటికి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గూగుల్ చెప్పింది.
ఇక నుంచి యాప్ టైటిల్ ను ఎక్కువ క్యారెక్టర్లకు కాకుండా 30 క్యారెక్టర్లకు మాత్రమే పరిమితం చేయనుంది. ఒక యాప్‌కు సంబంధించి ముఖ్యంగా దాని ఐకాన్. దాని విషయంలో డెవలపర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ దీనిలో డెవలపర్ ప్రమోషన్ పేరును తొలగించనుంది.
అంతే కాకుండా యాప్స్ క్రియేట్ చేసింది ఒకదాని కోసం అయితే ఐకాన్ పై ఇచ్చే గ్రాఫిక్స్ మాత్రం వినియోగదారులను తప్పుపట్టించే విధంగా ఇస్తుంటారు. ఇక వీటికి చెల్లు చీటి కానుంది. వీటిని నిషేధిస్తూ కొత్త గైడ్ లైన్స్ పెట్టనుంది.
అంతేకాకుండా క్యాపిటల్ ఫాంట్స్ వాడకాన్ని, యాప్ పేరులో చాలా మంది ఎమోజీలు వాడుతారు.. ఇక నుంచి వాటిని వాడకూడదని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. ఈ గైడ్‌లైన్స్ పాటించని యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లోకి అనుమతించబోమని కంపెనీ చెప్పింది.
లిస్టింగ్ ప్రివ్యూవ్‌కి సంబంధించి కూడా కొత్త ఎసెట్ గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది గూగుల్. ఈ గైడ్ లైన్స్ 2021 జూన్, జూలై మధ్య కాలంలో అమలులోకి వస్తాయని.. ఏ రోజు నుంచి అనేది త్వరలో ప్రకటిస్తామని గూగుల్ తెలిపింది. ఇవి అమలులోకి వస్తే ఫేక్ యాప్స్ కి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.