Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గూగుల్‌లో పురుషులు అధికంగా దేన్ని సర్చ్ చేశారంటే...?

గూగుల్‌లో పురుషులు అధికంగా దేన్ని సర్చ్ చేశారంటే...?
, శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (16:15 IST)
సెర్చింజన్ గూగుల్‌లో ఏది పడితే వెతికేస్తూ వుంటాం. ప్రతి సందేహానికి గూగుల్​ టక్కున సమాధానం ఇచ్చేస్తుంది. అలా ఈ గూగుల్‌ను మంచి కోసం ఉపయోగించుకునే వాళ్లు వున్నారు. చెడు కోసం ఉపయోగించుకునే వాళ్లూ వున్నారు. ఎందుకంటే.. గతేడాది కరోనా వైరస్​ విజృంభనతో భారత్​తో సహా అనేక దేశాలు లాక్​డౌన్​ విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. 
 
కంపెనీలన్నీ వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ప్రకటించాయి. ఇక విద్యాభోదన ఆన్​లైన్​కు మారింది. ఈ సమయంలో ప్రజలు గూగుల్​లో ఎలాంటి విషయాలను వెతికారనే దానిపై న్యూజిలాండ్‌లోని ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్​ఫ్లిక్ట్ స్టడీస్‌ అధ్యయనం నిర్వహిచింది. ఇందులో భార్యలపై ఎలా పైచేయి సాధించాలని ఎక్కువమంది మగవాళ్లు గూగుల్‌లో వెతికినట్టు సర్వే గుర్తించింది. వారి అధ్యయనంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి.
 
లాక్​ డౌన్ సమయంలో​ ప్రపంచవ్యాప్తంగా గృహహింస గణనీయంగా పెరిగిందన్న ఆందోళనకరమైన అంశం బయటపడింది. సుదీర్ఘ లాక్​డౌన్​ కారణంగా ప్రజలు ఇళ్లలో బంధీలుగా మారడంతో వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ముఖ్యంగా పురుషుల్లో పెరిగిన ఫ్రస్టేషన్​ ఎవరి మీద చూపించాలో తెలియక తమ భార్యలపై చూపించారని, ఫలితంగా మహిళలపై హింస గరిష్ట స్థాయికి చేరుకుందని అధ్యయనం వెల్లడించింది.  
 
లాక్​డౌన్​ సమయంలో చాలా మంది పురుషులు 'భార్యను అదుపులో పెట్టడం ఎలా?'.. 'ఎవ్వరికీ తెలియకుండా భార్యను ఎలా కొట్టాలి?' అనే విషయాలను గూగుల్​లో 16.50 కోట్ల సార్లు సెర్చ్​ చేశారని అధ్యయనంలో తేలింది. 
 
అదేవిధంగా "భార్యను ఇంట్లోనే ఎలా చంపాలి?" అనే విషయాన్ని 17.80 కోట్ల సార్లు స్టెర్చ్​ చేశారని అధ్యయనంలో తేలింది. ఇక, భర్తల హింస తట్టుకోలేక భార్యలు "నా భర్త నన్ను చంపేస్తాడు" అని 10.7 కోట్ల సార్లు, 'నన్ను కొడతాడు' అని 32 కోట్ల సార్లు గూగుల్​లో సెర్చ్​ చేశారని తేలింది. "దయచేసి నాకు సహాయం చెయ్యండి" అని అనేక మంది మహిళలు 1.22 బిలియన్ సార్లు గూగుల్​లో వెతికారని అధ్యయనం పేర్కొంది.
 
ఈ డేటాను సేకరించిన విధానాన్ని కాటెరినా అనే అధ్యయన కర్త వివరించారు. 'కరోనా లాక్​డౌన్​ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితమవ్వడంతో, తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక, గూగుల్​ను ఆశ్రయించారు. 
 
అసలు ఈ లాక్​డౌన్​ సమయంలో ప్రజలు ఎలాంటి విషయాలను సెర్చ్​ చేశారో తెలుసుకోవడానికి ఈ అధ్యయనం నిర్వహించాను. నా అధ్యయనంలో మహిళలు గృహ హింస ఎదుర్కొన్నారనే ఆందోళనకరమైన అంశం బయటపడింది' అని ఆమె చెప్పారు. భారత్‌లో కూడా లాక్‌డౌన్ సమయంలో ఎక్కువ గృహ హింస కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్కు మనిషిని పిండి చేసేసిన కరోనా, బాడీ బిల్డర్ జగదీష్‌ కరోనా కాటుతో మృతి