Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లైంగికవాంఛ తీర్చలేదనీ వృద్ధురాలిని చంపి మూడు ముక్కలు చేసిన వృద్ధుడు!

Advertiesment
లైంగికవాంఛ తీర్చలేదనీ వృద్ధురాలిని చంపి మూడు ముక్కలు చేసిన వృద్ధుడు!
, బుధవారం, 28 ఏప్రియల్ 2021 (11:30 IST)
వాళ్ళిద్దరూ వృద్ధులే. కానీ, వృద్ధుడులో మాత్రం ఇంకా లైంగిక కోర్కెలు తగ్గలేదు. దీంతో ఓ వృద్ధురాలిని లైంగిక కోర్కె తీర్చమన్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో పగపెంచుకున్న వృద్ధుడు ఆమెను హత్య చేసి మూడు ముక్కులు చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశాడు. 
 
ఈ దారుణం ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా కారేపల్లి అంబేడ్కర్‌ కాలనీకి చెందిన ఆదెర్ల ఉపేందర్‌ ఓ వృద్ధుడు. మండల పరిధిలోని భజ్యాతండాకు చెందిన అజ్మీరా నాజి(70) అనే వృద్ధురాలిని రెండు రోజుల క్రితం కాలనీలోని తన ఇంటి వద్దనే హత్య చేశాడు. 
 
కాళ్లు, చేతులు, తలను మొండెం నుంచి వేరు చేసి వాటిని చీమలపాడు అటవీ ప్రాంతంలో కాల్చి వేశాడు. అనంతరం సోమవారం రాత్రి మొండెంను బస్తాలో వేసుకుని మరో యువకుడి సాయంతో తరలించేందుకు ప్రయత్నించాడు. 
 
యువకుడు ఆ బస్తా గురించి అడగ్గా.. అది అడవి పంది అని, దుర్వాసన వస్తుండటంతో అటవీ అధికారులు చూస్తే కేసు అవుతుందని బయట పడవేస్తున్నానని నమ్మబలికి ఆ యువకుడి సాయంతో మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం తిర్లాపురం రైల్వే ట్రాక్‌పై పడవేశారు.
 
అయితే, ఉపేందర్‌ మాటలతో అనుమానం వచ్చిన సదరు యువకుడు మూట విప్పి చూడగా అందులో మొండెం కనిపించింది. దీంతో భయాందోళనలకు గురైన సదరు యువకుడు కారేపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. 
 
వెంటనే పోలీసులు ఉపేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా.. తాను లైంగిక వాంఛ తీర్చమని అడిగితే తిరస్కరించినందుకే హత్య చేశానని, శవాన్ని మాయం చేసేందుకే ఇలా చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం. 
 
ఘటనా స్థలాన్ని ఇల్లెందు ఏసీపీ వెంకటరెడ్డి, కారేపల్లి సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ సురేశ్‌ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహితపై మోజు.. భార్యాపిల్లలను వదిలేసి ఉడాయించిన భర్త!