Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబార్షన్... ఐతే ఈ పిండానికి తండ్రెవరో చెప్పండి? పోలీసులకు యువతి ప్రశ్న

ఒక మహిళకు అనుకోకుండా అబార్షన్ అయితే, ఆ పిండాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కడుపులో పెరిగిన పిండానికి తండ్రి ఎవరో చెప్పాలని కోరడంతో అక్కడి వారందరినీ విస్మయానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శియోనీ జిల్లాకు

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (15:38 IST)
ఒక మహిళకు అనుకోకుండా అబార్షన్ అయితే, ఆ పిండాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కడుపులో పెరిగిన పిండానికి తండ్రి ఎవరో చెప్పాలని కోరడంతో అక్కడి వారందరినీ విస్మయానికి గురిచేసింది.
 
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శియోనీ జిల్లాకు చెందిన పంకజ్ శివాహరే అనే యువకుడికి జబల్‌పూర్‌కి చెందిన రీటా అనే యువతితో చాలా కాలం క్రితం వివాహమైంది. కొంతకాలం తర్వాత రీటా గర్భం దాల్చడం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న పంకజ్ ఆ గర్భానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, రీటా కడుపులో పెరుగుతున్న పిండానికి తను తండ్రిని కాదని చెప్పి ఆమెను పుట్టింటికి పంపేసాడు.
 
ఇదిలావుండగా ప్రమాదవశాత్తూ రీటా కడుపులోని పిండం దెబ్బతిని అబార్షన్ చేయించారు. అయితే అబార్షన్ చేయించుకున్న తర్వాత ఆమె ఆ పిండాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఈ పిండానికి తండ్రి ఎవరో తెలియడానికి డిఎన్ఏ పరీక్ష చేయాలని కోరింది. దీనితో పోలీసులు కూడా వారిరువురి మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడానికి డిఎన్ఏ పరీక్ష చేయిస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments