Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగల 24 గంటల్లో... : బీజేపీకి ఆ పవార్ ఒక్కరే అండ - ఈ పవార్ చెంత 53 మంది ఎమ్మెల్యేలు

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (13:31 IST)
మహారాష్ట్రలో తెల్లవారకముందే కొలువుదీరిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి మరో 24 గంటలపాటు ఊరట లభించింది. ఫడ్నవిస్ ప్రభుత్వం బలాన్ని నిరూపించుకునే అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం తుదితీర్పును వెలువరించనుంది.
 
అయితే, బీజేపీకి శివసేన మద్దతు ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్‌ను మినహాయిస్తే మొత్తం 54 మంది ఎమ్మెల్యేల్లో 53 మంది ఎమ్మెల్యేలు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వెంట ఉన్నట్టు తేలిపోయింది. 
 
అజిత్ పవార్‌తో ఏ ఒక్కరూ లేరని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గురుగ్రాంలో బీజేపీ నిర్భంధంలో ఉన్న నలుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముంబైకి చేరుకున్నారని.. వారు తమతోనే ఉన్నారని ఎన్సీపీ చెప్పింది. అనిల్ పాటిల్, బాబాసాహెబ్ పాటిల్, దౌలత్ ధరోడా, నరహరి జిర్వార్‌లను బీజేపీ గురుగ్రాంలో ఇన్నాళ్లూ నిర్భంధించిందని ఎన్సీపీ ఆరోపించింది.
 
కుటుంబ సభ్యులకు కూడా అందుబాటులో లేకుండా పోయిన మరో ఎన్సీపీ ఎమ్మెల్యే అన్నా బన్సోడే కూడా పుణెలో ఉన్నట్లు తెలిసిందని.. త్వరలో తమ వద్దకు వస్తారని ఎన్సీపీ తెలిపింది. ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని.. తమకు 165 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సదరు పార్టీలు దీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. బల పరీక్షపై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments