Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహారాష్ట్ర సీఎం కుర్చీ శివసేనకు.. డిప్యూటీ - స్పీకర్ పోస్టులు ఖరారు

మహారాష్ట్ర సీఎం కుర్చీ శివసేనకు.. డిప్యూటీ - స్పీకర్ పోస్టులు ఖరారు
, సోమవారం, 11 నవంబరు 2019 (16:29 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో శివసేన నేత ఆశీనులుకానున్నారు. అలాగే, ఉప ముఖ్యమంత్రి పదవి ఎన్సీపీకి, స్పీకర్ పోస్టు కాంగ్రెస్ పార్టీలకు ఇచ్చేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయించినట్టు సమాచారం. 
 
మరోవైపు, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌కి అసెంబ్లీ స్పీకర్‌ వంటి కీలక పదవులను శివసేన ఆఫర్‌ చేసినట్లు ముంబై రాజకీయ వర్గల సమాచారం. 
 
అయితే దీనిపై శివసేన నుంచి ఇంకా అధికారిక ‍ప్రకటన మాత్రం వెలువడలేదు. కానీ ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు శివసేన నేతలు ‍ప్రకటించారు. ఇరు పార్టీల నేతలతో చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సేన నేతలు తెలిపారు. దీనిపై స్పందించిన ఎన్సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మాలిక్‌.. శివసేనకు మద్దతు ప్రకటించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
మరోవైపు, శివసేననకు మద్దతు అంశంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన భేటీ అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ.. దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. సేనకు మద్దతు, ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సి వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. 
 
మరోవైపు, మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా సోనియా కబురుపంపారు. దీనిపై సోమవారం సాయంత్రం వారితో మరోసారి సమావేశం కానున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నిర్ణయం కోసం ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఎదరుచూస్తున్నారు. సోనియాతో భేటీ తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామని పవార్‌ ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ త‌ర్వాత హైద‌రాబాదే, ఎందులో..?