Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

ఠాగూర్
గురువారం, 15 మే 2025 (12:56 IST)
భారత్ పాకిస్థాన్ వివాదంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ లక్ష్మణ రేఖను దాటారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఆయనపై పార్టీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శశిథరూర్ 'లక్ష్మణరేఖ'ను దాటాయని పార్టీ అంతర్గత వర్గాలు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
 
ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్డులో గల కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు సీనియర్ నేతలు సచిన్ పైలట్, శశి థరూర్ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం థరూర్ వ్యాఖ్యలపై పార్టీ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలిసింది.
 
"మాది ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ. నాయకులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఇక్కడ ఉంటుంది. అయితే, ఈసారి శశిథరూర్ మాత్రం తన వ్యాఖ్యలతో హద్దులు మీరారు. ఆయన లక్ష్మణరేఖను దాటారు" అని ఓ పార్టీ ప్రతినిధి పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత అభిప్రాయాల వెల్లడికి ఇది సమయం కాదని, పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని తాజా సమావేశంలో అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments