రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

ఠాగూర్
గురువారం, 15 మే 2025 (12:29 IST)
కోలీవుడ్ నటుడు సంతానం చిక్కుల్లో పడ్డారు. ఆయన నటించిన తాజా చిత్రం డీడీ నెక్స్ట్ లెవల్ చిత్రంలో ఆ కలియుగ శ్రీనివాసుడుని కించపరిచేలా ఓ ర్యాప్ పెట్టారు. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై తితిదే బోర్డు సభ్యుడు, బీజేపీ ఏపీ శాఖ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన నటుడు సంతానంతో పాటు చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్‌కు లీగల్ నోటీసు పంపారు.
 
'డీడీ నెక్స్ట్ లెవెల్' చిత్రం మే 16న థియేటర్లలో విడుదలైంది. అయితే, విడుదలకు కేవలం రెండు రోజుల ముందు, చిత్రంలోని 'కిస్సా 47' అనే ర్యాప్ పాటలో 'శ్రీనివాసా... గోవిందా' కీర్తనను ఉపయోగించడం హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. "ర్యాప్ పాటలో ' శ్రీనివాసా... గోవిందా'ను ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రైస్తవ లేదా ఇస్లాం మతాలకు సంబంధించిన ప్రార్థనలను ఇలా ర్యాప్ పాటల్లో ఉపయోగిస్తారా? ఎప్పుడూ హిందూ మనోభావాలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారు?" అని ఆయన ప్రశ్నించారు.
 
చిత్ర నిర్మాతలు, నటుడు సంతానం తక్షణమే క్షమాపణ చెప్పాలని, సినిమా నుంచి ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి ఆ వివాదాస్పద గీతాన్ని తొలగించాలని డిమాండ్ చేసినట్లు భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఒకవేళ వారు ఆ పాటను తొలగించకపోతే, రూ.100 కోట్ల నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
 
అలాగే, సెన్సార్ బోర్డుపై కూడా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. భవిష్యత్తులో ఏ చిత్ర నిర్మాత కూడా భక్తిగీతాలను ఇలా తేలికగా సినిమాల్లో వాడుకుని, మనోభావాలు దెబ్బతిన్నాయని ఎత్తి చూపినప్పుడు కేవలం క్షమాపణ చెప్పి తప్పించుకోకూడదని భానుప్రకాశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ లీగల్ నోటీసు కాపీని సెన్సార్ బోర్డుకు కూడా పంపామని, సినిమాలకు ధృవీకరణ పత్రాలు జారీ చేసేటప్పుడు వారు మరింత జాగ్రత్త వహించాలని సూచించారు. "అసలు సెన్సార్ బోర్డు అధికారులు ఈ అంశాన్ని ఎలా విస్మరించారు?" అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments