కాంగ్రెస్‌కు శరద్ పవార్ ఝలక్!

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (23:10 IST)
శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో సంచలన విషయాన్ని వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన కలిసి పోటీలోకి దిగే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ ప్రకటన కాంగ్రెస్‌కు శరాఘాతమే. ప్రస్తుతం మహా వికాస్ అగాఢీ పేరుతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను విడిపించుకోవాలన్న మూడ్‌లో ఎన్సీపీ, శివసేన ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘కాంగ్రెస్ ఒంటరిగా వెళ్లాలని అనుకుంటోంది. అదే నిజమైతే శివసేన, ఎన్సీపీ కలిసి బరిలోకి దిగుతాయి. ఈ విషయమై శరద్ పవార్, ఉద్ధవ్ ఇప్పటికే మాట్లాడేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నాం’’ అని సామ్నా లో శివసేన పేర్కొంది.

2024 సార్వత్రిక ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయని,అయినా ఇప్పుడే అన్ని పార్టీలూ ఎన్నికల గురించి మాట్లాడేస్తున్నాయని అభిప్రాయపడింది. దీనిని బట్టి చూస్తే మధ్యంతర ఎన్నికలను తీసుకురావాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోందని శివసేన పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments