Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాస్టార్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ దాకా... ఇపుడు రాజీనామా చేసిన శ్రీమతి పేడాడ రమణి కుమారి

మెగాస్టార్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ దాకా... ఇపుడు రాజీనామా చేసిన శ్రీమతి పేడాడ రమణి కుమారి
, శుక్రవారం, 14 మే 2021 (23:08 IST)
మెగాస్టార్ చిరంజీవి 2009లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రారంభమైన శ్రీమతి పేడాడ రమణి కుమారి రాజకీయ ప్రస్థానం 2011లో కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి పదవులు మరి 2014లో పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ స్థానం నుంచి 2019లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానమునకు పోటీ చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో దశాబ్దకాలం పాటు ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన దగ్గర్నుంచి రాష్ట్ర స్థాయిలోని జిల్లా స్థాయిలోనూ కాంగ్రెస్ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. పార్టీలో ఉన్నంత కాలం రాష్ట్రంలో జిల్లాలో ఎన్నో ఉద్యమాలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చిన దగ్గర్నుంచి రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు మరియు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేంత వరకు కృషి చేశారు. 

ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించి కాంగ్రెస్ పార్టీ కు ఎల్లవేళల కృషి చేసి ఆమెకిచ్చిన పదవులకు ఎంతో వన్నె తెచ్చారు శ్రీమతి పేడాడ రమణి కుమారి. ప్రస్తుతం  రాష్ట్రం లో ఉన్న పరిస్థితుల రీత్యా కాంగ్రెస్ పార్టీని వీడక తప్పలేదని కనుక తన కాంగ్రెస్ మహిళా అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని  తెలిపారు.

తన రాజీనామా పత్రాన్ని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సుస్మితా దేవికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు శైలజనాథ్‌కు పంపించారు. తనని ఇప్పటివరకు పార్టీలో తన వెంట ఉండి తనకు ఎంతో సహకరించిన పార్టీ నాయకులకు పార్టీ పెద్దలకు కార్యకర్తలకు కృతజ్ఞతరాలై ఉంటానని ఒక ప్రకటనలో తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా జ్వరపీడితుల స‌ర్వే: అనిల్‌కుమార్ సింఘాల్