Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం మంత్రి చెప్పులకు సెక్యూరిటీ... ఎక్కడ? ఏమిటి?

సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు రక్షణగా భద్రతా సిబ్బంది (సెక్యూరిటీ గార్డు)ని నియమించుకోవడం సహజం. కానీ, మంత్రులు, ఎమ్మెల్యే చెప్పులకు కూడా భద్రతా సిబ్బందిని నియమించుకుంటున్నారు.

Webdunia
గురువారం, 17 మే 2018 (14:01 IST)
సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు రక్షణగా భద్రతా సిబ్బంది (సెక్యూరిటీ గార్డు)ని నియమించుకోవడం సహజం. కానీ, మంత్రులు, ఎమ్మెల్యే చెప్పులకు కూడా భద్రతా సిబ్బందిని నియమించుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్ చెప్పులకు ఓ వ్యక్తి కాపలాగా ఉండటం మీడియా కంటపడింది. అంతే ఆ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇపుడు వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ బుధవారం మహాకాళి మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విడిచిన శాండిల్స్‌(చెప్పులు)ను ఎవరూ పట్టుకుపోకుండా చూసేందుకు ఆలయ ఉద్యోగి ఒకరు గంటపాటు కాపలాగా ఉన్నారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మంత్రి తిరిగి వచ్చి, ఆ చెప్పులు వేసుకునే వరకూ అతను అలానే నిలుచునే ఉన్నారు. 
 
కాగా, మే 11న కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మహాకాళి మందిరాన్ని దర్శించుకున్నప్పుడు ఆయన చెప్పులు మాయమయ్యాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే జ్యోతిరాదిత్యకు నూతన చెప్పులు కొనిచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకునే మంత్రి భూపేంద్ర సింగ్ శాండిల్స్‌కు ఈ విధమైన రక్షణ కల్పించారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments