Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యప్రదేశ్ పాఠశాలల్లో ''జైహింద్'' అనాలట.. ఎందుకంటే?

మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ పాఠశాలలకు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థులు హాజరు చెప్పేటప్పుడు ప్రతీ విద్యార్థి జై హింద్ అనాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్, నో అ

మధ్యప్రదేశ్ పాఠశాలల్లో ''జైహింద్'' అనాలట.. ఎందుకంటే?
, గురువారం, 17 మే 2018 (10:39 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ పాఠశాలలకు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థులు హాజరు చెప్పేటప్పుడు ప్రతీ విద్యార్థి జై హింద్ అనాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్, నో అనకుండా ''జైహింద్'' అని పలకాలని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది.


అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఈ విధానాన్ని అమలులోకి తెస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు ఈ ఉత్తర్వులతో పనిలేదని.. వారి ఇష్టానుసారం వ్యవహరించవచ్చునని ఇష్టం ఉంటే జైహింద్ అనొచ్చు, లేదంటే అక్కర్లేదని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు సూచిస్తూ స్కూళ్లకు లేఖలు పంపించామని పేర్కొంది.
 
మధ్యప్రదేశ్‌లో మొత్తం 1.22 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇకపై వారంతా హాజరు పలికే సమయంలో ‘జై హింద్‌’ అని చెప్పాల్సిందే. ఇలా చేస్తే పిల్లల్లో దేశభక్తి పెరుగుతుందని ఆ రాష్ట్ర సర్కారు భావిస్తోంది.

అయితే, ఆ రాష్ట్ర  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశభక్తిని బలవంతంగా రుద్దలేమని.. తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచాలనే విషయాన్ని విపక్షాలు గుర్తు చేశాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రండి బాబోయ్.. రండి... కర్ణాటకలో జోరుగా గుర్రాల బేరాలు : సినీ నటి రమ్య