లక్నోలో 144 సెక్షన్‌: జనవరి 5, 2022 వరకు అమలు

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (08:24 IST)
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 144 సెక్షన్‌ అమలులోకి వచ్చింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వచ్చింది. జనవరి 5, 2022 వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటుంది. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ముప్పు పెరుగుతున్న క్రమంలో యోగి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 
 
జనం గుమికూడే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంటుంది. సైబర్ క్రైమ్ సెల్ కూడా ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిశితంగా గమనిస్తుంది. ఆన్‌లైన్‌లో పుకార్లు వ్యాప్తి చేయడం, అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
 
క్రిస్మస్, డిసెంబర్ 31, న్యూ ఇయర్ పార్టీల సమయంలో, కరోనా వైరస్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది సర్కారు. పోలీసులు మాస్క్ ధరించడం, రెండు గజాల దూరం పాటించడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. 
 
సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు, జిమ్‌లు, స్టేడియంలను 50 శాతం సామర్థ్యంతో మాత్రమే తెరవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. నగరంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, ఏదైనా కార్యక్రమాలలో 100 మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments