Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో వాయు కాలుష్యం-మళ్లీ మూతపడనున్న పాఠశాలలు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (18:03 IST)
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వేధిస్తుంది. ఇప్పటికే కరోనా ఒకవైపు... వాయు కాలుష్యం మరోవైపు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. దీంతో వాయు కాలుష్య సంక్షోభం కారణంగా ఢిల్లీలో శుక్రవారం నుంచి పాఠశాలలు మూసివేయనున్నారు. దీంతో సోమవారమే ప్రారంభమైన పాఠశాలలు మళ్లీ మూతపడనున్నాయి.
 
ఈ మేరకు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలు మూసి ఉంటాయని ఢిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్ గురువారం వెల్లడించారు. కాలుష్య పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడంపై సుప్రీం ఢిల్లీ సర్కారుపై ఫైర్ అయ్యింది. 
 
మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. కానీ పెద్దలు ఇంటినుంచి పనిచేస్తున్నారు.. ఇదేంటి అంటూ సుప్రీం కోర్టు మందలించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా సుప్రీంకు వివరణ ఇచ్చింది. 
 
గాలి నాణ్యత మెరుగుపడుతుందనే సూచనను పరిగణనలోకి తీసుకొని పాఠశాలలు తెరిచామని ఢిల్లీ సర్కారు వెల్లడించింది. అయితే వాయు కాలుష్య స్థాయులు మళ్లీ పెరిగాయి. దీంతో పాఠశాలలు మూతపడనున్నాయి.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments