Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెల్లింగ్ నేర్పస్తానంటూ విద్యార్థినిని గదిలోకి పిలిపించుకుని...

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (14:56 IST)
ఇద్దరు విద్యార్థినులపై ఓ పాఠశాల డైరెక్టర్ కన్నేశాడు. స్పెల్లింగ్ నేర్పిస్తానని ఒక విద్యార్థిని తన గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డడాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ పట్టణంలో చోటుచేసుకుంది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రాజ్‌కోట్‌ లోధిక తాలుకాకు చెందిన దినేష్ జోషి అనే వ్యక్తి ఓ ప్రైవేటు పాఠశాలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 
 
ఇటీవల కరోనా వ్యాప్తి శాంతించడంతో పాఠశాలలు తెరుచుకున్నాయి. దినేశ్‌ జోషి కొన్ని రోజుల క్రితం స్పెల్లింగులు నేర్పిస్తానంటూ ఇద్దరు బాలికలను తన రూమ్‌కి రమ్మని పిలిచాడు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థులు గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
 
అక్కడి నుంచి వచ్చిన అనంతరం ఓ బాలిక ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. మరో అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలిసింది. వీరిద్దరేగాక అతని ప్రవర్తన అందరితో ఇలానే ఉండేదని పోలీసులు తెలిపారు. 
 
ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇతర బాధిత విద్యార్థులు అంతకుముందు తమపై జరిగిన దారుణాల గురించి చెప్పారు. దీంతో దాదాపు వంద మంది తల్లిదండ్రులు, విద్యార్థినులు లోధిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జోషిపై ఫిర్యాదు చేశారు. నిందితుడు జోషి భార్య సీమా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments