Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేమంత్ సొరేన్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు... హైకోర్టే దానికి సరైన వేదిక...

వరుణ్
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (13:46 IST)
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు సుప్రీంకోర్టులో తేరుకోలేని షాకిచ్చింది. తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు అపెక్స్ కోర్టు నిరాకరించింది. పైగా, ఈ పిటిషన్ దాఖలు చేసేందుకు సరైన వేదిక హైకోర్టేనని స్పష్టంచేసింది. అందువల్ సొరేన్ పిటిషన్‌ను స్వీకరించబోమని న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ పిటిషన్‌కు తగిన వేదిక సుప్రీంకోర్టు కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుదరేశ్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. అందువల్ల ఈ పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని మాజీ సీఎంకు సూచించింది. 
 
జార్ఖండ్ అక్రమ భూలావాదేవీలపై విచారణ జరుపుతున్న ఈడీ ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై మాజీ సీఎం హేమంత్ సొరేన్‌ను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో పీఎంఎల్ఏ కోర్టు సొరేన్‌కు ఒక రోజు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. అయితే, సొరేన్ వద్ద విచారణ జరిపేందుకు పది రోజుల కష్టీ కావాలని ఈడీ కోరింది. దీనిపై తీర్పును నేటికి రిజర్వు చేసింది. 
 
వైకాపా రంగుల పిచ్చి ... శవాల గదినీ వదిలిపెట్టని నేతలు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా నేతలు సొంత పార్టీ రంగుల పిచ్చి బాగా ముదిరిపాకానపడిందనే విమర్శలు విపక్ష నేతలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను నిజం చేస్తేలా వైకాపా నేతల ప్రవర్తన ఉంది. తాజాగా శవాల గదికి కూడా వైకాపా రంగులు వేయించారు. ఈ ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వం ఆస్పత్రికి చెందిన శవాల గదికి వైకాపా రంగులు వేసి సంబరాలు జరుపుకున్నారు. 
 
నాయుడుపేటలో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రివుంది. ఈ ఆస్పత్రి అభివృద్ధి పనుల కోసం నాబార్డు రూ.5.13 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆస్పత్రి అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వివిధ రకాలైన నిర్మాణ పనులు చేపట్టారు. అయితే, ఈ భవనం లోపల పనులు పూర్తికాకపోయినప్పటికీ ఆస్పత్రి ప్రారంభానికి మాత్రం అధికార వైకాపా నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. భయం బయట వైకాపా రంగులు వేస్తున్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని, త్వరగా ప్రారంభించాలని వైకాపా నేతలు తహతహలాడుతున్నారు. దీనిపై డీఈ సాంబశివరావుకు వివరణ కోరగా మరో 20 రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఆస్పత్రికి వేస్తున్నవి పార్టీ రంగులు కావని, నిబంధనల మేరకు వాటిని వేస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments