Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ ఆస్తులు రూ.5 లక్షల కోట్లా?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమెను అడ్డుపెట్టుకుని శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు దేశ వ్యాప్తంగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఆదాయన్ను శాఖ అధికారుల తనిఖీల్లో వెల్లడైంద

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (08:36 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమెను అడ్డుపెట్టుకుని శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు దేశ వ్యాప్తంగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఆదాయన్ను శాఖ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ముఖ్యంగా, శశికళ కుటుంబానికి మొత్తం ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్టు ఐటీ దాడుల్లో వెల్లడైంది. దీంతో మరోమారు శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లలో భారీ ఎత్తున సోదాలు జరిపేందుకు వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. 
 
ఇటీవల శశికళ, దినకరన్, వారి కుటుంబ సభ్యులు, అనచరులు, బినామీల నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపిన విషయం తెల్సిందే. ఈ సోదాల్లో అనేక కీలక పత్రాలు, దస్తావేజులను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. వాటిని పరిశీలించగా, వారికి కళ్లు చెదిరిపోయే వాస్తవాలు తెలిసినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా,శశికళ, ఆమె కుటుంబ సభ్యులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తులు, వాణిజ్య సముదాయాలు, ఫ్యాక్టరీలను కొనుగోలు చేసి, బినామీల ద్వారా వాటిని నిర్వహిస్తున్నట్టు తేలిందని ఓ ఐటీ అధికారి వ్యాఖ్యానించారు. వాటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇటీవల పొయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసంలో జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, పెన్‌డ్రైవ్‌లలో ఉన్న సమాచారాన్ని ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. 
 
ఇందులోని సమాచారం ఆధారంగానే ఆమెకు దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నట్టు బయటపడింది. దీంతో మరోమారు తనిఖీలు నిర్వహించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. శశికళ కుటుంబ  సభ్యులు, బంధువులు, బినామీలకు మొత్తం 240 బ్యాంకు లాకర్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments