Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (13:18 IST)
నెలకు కేవలం 15 వేల రూపాయలను సంపాదించే ఓ పారిశుద్ధ్య కార్మికుడుకి ఆదాయపన్ను శాఖ అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. ఏకంగా రూ.34 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను స్వీకరించిన ఆ కార్మికుడు ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాకు చెందిన కరణ్ కుమార్ అనే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అయితే, అతడికి ఆదాయపన్ను విభాగం అధికారుల నుంచి నోటీసులు అందాయి. కానీ, వాటిలో ఏముందో అతడికి అర్థంకాకపోవడంతో విద్యావంతులను అడిగి అసలు విషయం తెలుసుకుని ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించాడు. 
 
2019-20లో కరణ్ రూ.34 కోట్ల ఆదాయాన్ని అర్జించాడు. ఆ యేడాదికి ఎలాంటి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు" అని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ, కరణ్ కుమార్ మాత్రం ఆగ్రాలోని ఖైర్‌లో ఉన్న ఎస్.బి.ఐ శాఖలో పారిశుద్ధ్యం కార్మికుడుగా పనిచేస్తున్నాడు. తన జీతం నెలకు రూ.15 వేలు మాత్రమేనని వెల్లడించారు. అతని పాన్ కార్డు వివరాలు దుర్వినియోగం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఇటీవల అలీగఢ్‌కు చెందిన జ్యూస్ సెంటర్ వ్యాపారికి రూ.7.5 కోట్లు చెల్లించాలని నోటీసులు అందిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments