Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో డ్రగ్స్ రాకెట్.. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. యంగ్ హీరో కూడా..?

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (13:57 IST)
కర్ణాటకలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ రాకెట్‌.. తెలంగాణలోను కుదిపేస్తోంది. డ్రగ్స్‌ కేసులో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని బెంగళూరు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. తెలంగాణ ఎమ్మెల్యేల ప్రమేయంపై బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిలో ఇప్పటికే ఒక ఎమ్మెల్యే పేరును నిర్ధారణ కాగా.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
అలాగే టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఉన్నాడని బెంగళూరు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. రెండు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఈ డ్రగ్స్ రాకెట్ ఇపుడు అటు కర్ణాటకలోను.. ఇటు తెలంగాణలోను హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఉద్యమకారుడినంటూ చెప్పుకుని డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు..? తెలంగాణకు చెందిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
 
ఫిబ్రవరి 26న బెంగళూరు తూర్పు డివిజన్ పోలీసులు నవగరా సర్వీసు రోడ్డులో నైజీరియా ముఠా గుట్టును రట్టు చేశారు. కన్నడ సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు వచ్చిన నైజీరియాకు చెందిన హారిసన్, జాన్‌ నాన్సోలను పట్టుకున్నారు. వారి నుంచి కోట్లు విలువైన భారీ మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్న ముఠా వద్ద బెంగళూరు పోలీసులకు తీగలాగితే అసలు డ్రగ్స్ డొంక కదిలింది. 
 
తెలంగాణలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు డ్రగ్స్‌ కేసులో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడినంటూ చెప్పుకునే వ్యక్తి తెలంగాణ ఎమ్మెల్యేలకు మత్తు పదార్థాలు సరఫరా చేసినట్లు బెంగళూరు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments