తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఒక వైపు కరోనా మరో వైపు ఎండలతో జనాలకు చెమట్లు పడుతుంటే దీనికి తోడు వడగాలులు జతయాయ్యాయి. తీవ్రమైన ఎండలు, వడగాలులు ప్రజలను భయపెడుతున్నాయి.
సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి తీవ్రత మరింత అధికంగా ఉండనుంది. దీంతో వాతావరణ కేంద్రం అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు. మూడు రోజులు ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.
అత్యవసరం అయితే తప్ప ఎండలో తిరగకపోవడమే మంచిదన్నారు. ఎండలో తిరగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలన్నారు.
దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ బదులుగా కొబ్బరి బొండాలు, నిమ్మరసం, మజ్జిగ వంటివి తాగాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.