Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతనికి 54.. ఆమెకు 25... పెళ్లికి నిరాకరించిందనీ...

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (09:52 IST)
అతని వయసు 54 యేళ్లు. ఆమె వయసు 25 సంవత్సరాలు. కానీ, గత రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూవచ్చారు. ఇలా అక్రమ సంబంధం కొనసాగించడం కంటే.. తనకంటే పాతిక సంవత్సరాలు చిన్నదైన ఆ మహిళను పెళ్లి చేసుకోవాలని ఆ వ్యక్తి భావించాడు. ఆ వెంటనే తన మనసులోని మాటను ఆమెకు చెప్పాడు. కానీ ఆమె మాత్రం సమ్మతించలేదు కదా.. అక్రమ సంబంధాన్ని కూడా తెంచుకుంటానని బెదిరించింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ వ్యక్తి.. ఆ మహిళను కత్తితో పొడిచి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా కేంద్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లా కేంద్రమైన సేలం రైల్వే స్టేషన్‌ సమీపంలో కాసా కారనూర్‌ అనే ప్రాంతంలో సెరిన్ సితారాబాను (25) అనే మహిళ పనికి చేరింది. ఈమె భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో ఈ దుకాణం పక్కనే ఉన్న మరో దుకారణ యజమాని ఇనాముల్లా (54)తో సెరిన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా తమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే, రహస్యంగా ఆమెతో లైంగికవాంఛ తీర్చుకోవడం కంటే పెళ్లి చేసుకుని ఆమెతో జీవించాలని ఇనాముల్లా భావించాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. కానీ, ఆయన మాటలకు ఆమె అంగీకరించలేదు. 
 
దీంతో ఆగ్రహించిన ఇనాముల్లా.. మరుసటి రోజు ఓ కత్తిని తీసుకుని ఐస్‌క్రీమ్ దుకాణానికి వచ్చాడు. సితారాబాను ఉన్న గదికి వెళ్లి తలుపు వేసి లోపల గడియపెట్టాడు. తర్వాత తాను తీసుకొచ్చిన కత్తితో సితారాబానును నరికి హత్య చేశాడు. ఆ సమయంలో ఆమె అరుపులు విని స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తలుపులు తట్టగా తెరుచుకోలేదు. లోపలి వైపు తలుపు గడియ పెట్టి ఉంది. 
 
సమాచారం అందుకున్న సూరమంగళం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు తెరవడానికి ప్రయత్నించారు. వీలుకాకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సితారాబాను రక్తపు మడుగులో శవంగా పడి ఉండగా, పక్కనే ఉన్న ఫ్యాన్‌కు ఇనాముల్లా ఉరి వేసుకుని శవంగా వేలాడుతూ కనిపించాడు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments