Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భన్వర్ లాల్‌కు వైకాపా మహిళతో అక్రమ సంబంధం? ఆమంచి కృష్ణమోహన్ ఏమంటున్నారు?

Advertiesment
భన్వర్ లాల్‌కు వైకాపా మహిళతో అక్రమ సంబంధం? ఆమంచి కృష్ణమోహన్ ఏమంటున్నారు?
, ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (14:41 IST)
గుంటూరు జిల్లా చీరాల అసెంబ్లీ స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేస్తున్న నేత ఆమంచి కృష్ణమోహన్. ఈయన ఆదివారం చీరాలలో విలేకరులతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, నంద్యాల ఉప ఎన్నిక సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆయన గుర్తుకు తెచ్చారు. 
 
"నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అప్పటి ఎన్నికల అధికారి భన్వర్ లాల్ టీడీపీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉన్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేయించి.. ప్రచారానికి వచ్చిన వైసీపీ మహిళల్లో ఒకరితో ఆయనకు అక్రమ సంబంధం అంటగట్టాలని టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు చెప్పారని ఆమంచి ఆరోపించారు. ఈ ఇలా తాను వ్యాఖ్యానించలేదని చంద్రబాబు నార్కో అనాలసిస్‌కు సిద్ధమా? నీ మనవడు దేవాన్ష్ పై ప్రమాణం చేసి చెబుతావా" అంటూ ప్రశ్నించారు. ఏపీలో ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 
 
అంతేకాకుండా, తెలంగాణ సీఎం కేసీఆర్ కేసు పెడితే చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై 17 కేసులు ఉన్నాయనీ, ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయన్నారు. తాను ప్రజా ఉద్యమంలో ఉన్నప్పుడు కేసులు పెట్టారని స్పష్టంచేశారు. చీరాలకు విమానాశ్రయం తీసుకొస్తానని చంద్రబాబు జోక్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఏం అవసరమో బాబుకు అస్సలు అవగాహన లేదని ఆమంచి కృష్ణమోహన్ దుయ్యబట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసెంబ్లీలో ఫ్యాన్, స్టాండులో సైకిల్, క్యాంటీన్‌లో గ్లాసు : పృథ్వీ జోస్యం