Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దుర్మార్గులు రైతులనే కాదు... జర్నలిస్టునూ హత్య చేశారు...

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:51 IST)
ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్‌లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు ఆశిష్, నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు తోలి నలుగురు రైతులను పొట్ట‌న‌పెట్టుకున్న సంఘటన‌లో ఒక జర్నలిస్ట్ కూడా అమరుడయ్యాడు. లఖింపూర్ ఘటన సమయంలో నిఘాసన్‌కి చెందిన  జర్నలిస్ట్ రామన్ కశ్యప్ అదృశ్యమయ్యారు. ఆయ‌న గురించి ఆచూకీ తీయ‌గా, చివ‌రికి ఆ జర్నలిస్ట్ మృతదేహాన్నిరాత్రి ఆసుపత్రిలో కనుగొన్నారు.
 
అతను సాధనా న్యూస్ ఛానల్ వీడియో జర్నలిస్ట్. సంఘటన స్థలానికి సంబంధించిన విజువల్స్ తీస్తుండగా, వేగంగా వచ్చిన వాహనం వారిని ఢీకొనడంతో రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోయాడు. రామన్ కశ్యప్‌కు ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు. చిన్న అమ్మాయి పాలు తాగే పసిపాప. ఇంత దుర్మార్గంగా జ‌ర్న‌లిస్టును పొట్ట‌న‌పెట్టుకున్నార‌ని స్థానిక జర్నలిస్ట్ లు చాలా ఆగ్రహంతో ఉన్నారు.  మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, యాభై లక్షలు పరిహారంగా ఇవ్వాల‌ని జ‌ర్న‌లిస్టు సంఘాలు డిమాండు చేస్తున్నాయి. హత్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. 
 
ప్రెస్ జనరల్ ఆఫ్ ఇండియా ధీరజ్ గుప్తా, శిశిర్ శుక్లా సీనియర్ అధికారులతో సహా వందలాది మంది జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. జ‌ర్న‌లిస్టు కుటుంబాన్ని ఆదుకోవాల‌ని, పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1000 కోట్ల మార్క్ రికార్డ్‌కు చేరువలో దీపికా పదుకునే.. కల్కితో సాధ్యమా?

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments