Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమ్మీద వీడంతటి అదృష్టవంతుడు మరొకరు ఉండరు ... ఎందుకో తెలుసా? (Video)

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (11:25 IST)
సాధారణంగా క్రూర జంతువుల కంట పడితో బతికిబట్టకట్టడం అసాధ్యం. అలాంటిది.. ఓ పులి చేతిలో చిక్కి చివరకు ప్రాణాలతో బయటపడటం అంటే.. ఇంతకుముంచిన అదృష్టం మరొకటి ఉండదు. ఇలాంటి సంఘటన నిజంగానే జరిగింది. ఓ వ్యక్తిపై పులి పంజాతో కొట్టినంతపనిచేసి.. అతని కాలిపిక్కను కూడా పట్టుకుంది. కానీ, ఎందుకనే.. ఆ వ్యక్తిని చంపకుండా పులి వెనుదిరిగి వెళ్లిపోయింది. 
 
దీంతో బతుకుజీవుడా అంటూ ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడి బిత్తర చూపులు చూస్తూ నడుచుకుంటూ వెళ్లాడు. ఇది ఏ సినిమాలోనో కనిపించిన దృశ్యం కాదు. నిజంగానే జరిగింది. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని తేజ్‌పూర్ అటవీ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాల్లోకి ఓ రాయల్ బెంగాల్ టైగర్ ఒకటి వచ్చింది. ఇది స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ పెద్దపులి కంటపడిన ఓ వ్యక్తి అదృష్టవశాత్తు బతికిబయటపడ్డాడు. 
 
తేజ్‌పూర్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లోకి వచ్చిన పెద్దపులి స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. వారిపై దాడికి యత్నించడంతో రైతులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని తలో దిక్కుకు పరుగులు తీశారు. వారిలో ఓ రైతును పులి వెంటతరమడమే కాదు పంజాతో కొట్టిచంపినంత పనిచేసింది. 
 
పులి వెంటపడటంతో దిక్కుతోచని ఆ రైతు... పరుగులు తీస్తూ ఓ గోతిలో దూకేశాడు. పులి కూడా అమాంతం అతనితో పాటే గోతిలోకి దూకేసింది. అయితే ఎందుకనో వెంటనే వెనక్కి వచ్చేసి ఇసుక దిబ్బలనెక్కి సమీపంలోని చెట్లలోకి మాయమైంది. ఈ ఘటన తాలూకు వీడియోను భారత అటవీశాఖ అధికారులు ట్విట్టర్‌లో షేర్ చేయగా, అది వైరల్ అయింది. అయితే, ఈ పులిదాడిలో ఇద్దరు గాయపడ్డారు.

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments