Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మాస్క్‌ లేకుండా తిరిగితే రూ. 2వేలు ఫైన్‌

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (08:43 IST)
గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీని కరోనా వణికిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కట్టడి చర్యలు ప్రారంభించారు. అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి విపత్కర సమయాల్లో అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో రాజకీయాలు తగదని హితవు పలికినట్లు చెప్పారు.

బ్రతికుంటే జీవితమంతా రాజకీయాలు చేయవచ్చునని, కాని ఈ పరిస్థితుల్లో రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షించేందుకు పాటు పడాలని సూచించానని కేజ్రీవాల్‌ తెలిపారు. మాస్క్‌ లేకుండా తిరిగితే రూ. 2 వేలు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు.

గతంలో ఫైన్‌ రూ.500 ఉండగా దాన్ని ఇప్పుడు రెండు వేల రూపాయలకు పెంచారు. కాగా, పండుగలపై ఎలాంటి నిషేధాన్ని విధించలేదని స్పష్టం చేశారు. నదీ స్నానాలకు ఎక్కువ మంది హాజరుకావడంపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.

పండుగలన్నీ ఇళ్లల్లోనే ఉండి జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఛట్‌ పూజను జాగ్రత్తగా జరుపుకోవాలని, 200 కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండాలని సూచించారు. గుంపులో ఒక్కరికి కరోనా సోకినా..మిగిలిన వారికి సోకే అవకాశాలున్నాయన్న నిపుణుల హెచ్చరికలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments