అవినీతి వ్యవహారాలకు సంబంధించి అదే విధంగా క్రిమినల్ కేసులకు సంబంధించి విచారణ వేగవంతంగా పూర్తి చేసి తొందరగా శిక్షలు ఖరారు చేయాలని నిజానిజాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే దాదాపుగా దేశంలో ఉన్న అన్ని హైకోర్టులు కూడా దూకుడు పెంచాయి. కిందిస్థాయి కోర్టులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా కూడా ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త దుమారం రేపుతోంది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. నాయకుల అవినీతి కేసులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఒకసారి చూస్తే ఢిల్లీ హైకోర్టు పరిధిలోనే జిల్లా కోర్టులో అన్నీ కూడా మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని అదేవిధంగా 2100 పైగా ఉన్న నేరస్థులు అందరూ కూడా వచ్చి జైల్లో లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్తూ నవంబరు 1 నుంచి నవంబర్ 13 వరకు గడువు పెడుతూ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు దీనిపై దేశవ్యాప్తంగా కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. దాదాపుగా అన్ని హైకోర్టులు కూడా ఇదే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
జిల్లా కోర్టులు అన్నీ కూడా దేశవ్యాప్తంగా నేరస్తులకు బెయిల్ రద్దు చేసే ఆదేశాలు ఇచ్చే విధంగా హైకోర్టులు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ముందుగా ఢిల్లీ హైకోర్టు నుంచి కార్యక్రమం మొదలు పెట్టినట్టు సమాచారం. ఇక దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా త్వరలోనే పలు మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
దీనితో మన తెలుగు రాష్ట్రాల్లో మధ్యంతర బెయిల్ పై ఉన్న వారందరూ కూడా కంగారు పడుతున్నారు. నేరం రుజువు అయిన తర్వాత కూడా బయట తిరిగే వారు అందరూ ఇప్పుడు దాదాపుగా జైలుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.