వైఎస్ఆర్‌సీపీ గుర్తింపు రద్దు చేయండి: ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

శుక్రవారం, 10 జులై 2020 (16:32 IST)
రిజిస్టర్ చేసుకున్న పేరుకీ, ప్రజల్లో వినియోగిస్తున్న పేరుకీ పొంతన లేకుండా లబ్ది పొందుతున్న వైఎస్సార్సీపీ గుర్తింపు రద్దు చేయాలని అభ్యర్థిస్తూ అన్నా వైఎస్ఆర్ పార్టీ నేత బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా బాషా ఫిర్యాదు చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్ఆర్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందించారు. 
 
ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో తనకు షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం యజమాని భార్యను లైన్లో పెట్టాడు, అడ్డుగా ఉన్న యజమానిని?