Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్‌: సీరం సంస్థ

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (08:40 IST)
కరోనా వ్యాక్సిన్ పై సీరం సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేసింది.

ఆక్స్‌ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తొలుత హెల్త్‌కేర్ వర్కర్లకు, వయసు పైబడిన వారి కోసం ఫిబ్రవరి 2021 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని, సామాన్య ప్రజలకు ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ధర రెండు డోసులకు గానూ దాదాపుగా రూ.1000 వరకూ ఉండొచ్చని పూనావాలా తెలిపారు.

ఇప్పటికే నాలుగు కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను సిద్ధం చేశామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) తెలిపింది. నియంత్రణ సంస్థల నుంచి సరైన సమయంలో ఆమోదం లభిస్తే, 2021 జనవరి లోపు ఈ వ్యాక్సిన్‌ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సీఐఐ సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు.

కాగా, దేశంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ కోసం మూడో దశ పరీక్షలకు నమోదు ప్రక్రియను పూర్తిచేశామని సీఐఐ, ఐసీఎంఆర్‌ ప్రకటించాయి.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments