Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా ఒత్తిడి వల్లే అది చేశా.. బాబాకు లొంగని వాళ్లను కుర్చీకి కట్టేసి?

రేపిస్ట్ గుర్మీత్ సింగ్ బాబా పాపాల చిట్టా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్వ‌ప్న చౌధురి అనే ఓ గాయ‌కురాలు, డాన్స‌ర్‌.. తాజాగా గుర్మీత్ గురించి తాను అనుభవించిన కష్టాలను బయటపెట్టారు. డేరా బాబా కేసు విచార‌ణ‌ల

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (15:25 IST)
రేపిస్ట్ గుర్మీత్ సింగ్ బాబా పాపాల చిట్టా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్వ‌ప్న చౌధురి అనే ఓ గాయ‌కురాలు, డాన్స‌ర్‌.. తాజాగా గుర్మీత్ గురించి తాను అనుభవించిన కష్టాలను బయటపెట్టారు. డేరా బాబా కేసు విచార‌ణ‌లో భాగంగా మంగ‌ళ‌వారం ఆమె చండీగ‌ఢ్‌కు వ‌చ్చారు. గుర్మీత్ బాబా గొప్ప‌త‌నాన్ని ప్ర‌చారం చేయ‌డానికి ఆమెను బాబా పావుగా వాడుకున్నాడని తెలిసింది. 
 
డేరాబాబాపై ప్రచారం చేయడం ఇష్టం లేకపోయినా.. అత‌ని అనుచ‌రుల ఆగ‌డాల‌కు భ‌య‌ప‌డి ఆడుతూ, పాడుతూ వుండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. గతంలో  గుర్మీత్‌ను కీర్తిస్తూ ఆమె పాడిన కొన్ని పాట‌లు వివాదాల‌ను రేకెత్తించాయి. వాటిపై కేసులు కూడా న‌మోద‌య్యాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌రువాత బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. కేసు విచార‌ణ‌లో భాగంగా- ఆమె చండీగ‌ఢ్ హైకోర్టుకు వ‌చ్చింది. తాను ఉద్దేశ‌పూర‌కంగా ఆ పాట‌ల‌ను పాడ‌లేద‌ని, గుర్మీత్ ఒత్తిడితోనే ఆ ప‌ని చేయాల్సి వ‌చ్చింద‌ని న్యాయ‌మూర్తుల‌కు వివ‌రించింది. బేషరతుగా క్షమాపణలు కోరింది. 
 
మరోవైపు సాధ్వీల అత్యాచారం కేసులో గుర్మత్ రామ్‌రహీంకు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల బాలికను కూడా డేరా బాబా వదిలిపెట్టలేదని పోలీసుల విచారణలో తేలింది. గురుదాస్ అనే బాబా బాధితుడు కీలక నిజాలను పోలీసులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బాబా దగ్గరకు సాధ్విలు అమ్మాయిలను తీసుకెళ్లేవారని.. వారు ఎదురుతిరిగితే వారిని హింసించేవారని.. ఆపై బాబా వద్దకు వెళ్తే పునీతులు అవుతారని నచ్చజెప్పే వారని గురుదాస్ చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

ఈ యేడాది ఆఖరులో సెట్స్‌పైకి 'కల్కి-2' : నాగ్ అశ్విన్

Mad Square: ఇది మాడ్ కాదు మాడ్ మ్యాక్స్ అంటూ మ్యాడ్ స్క్వేర్ నుంచి హుషారైన గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments