Webdunia - Bharat's app for daily news and videos

Install App

'యే దస్‌ సాల్‌.. గుర్మీత్‌కే నామ్‌'.. ఆ జడ్జి నల్లకోటు ధరించిన రియల్ హీరో

నమ్మి ఆశ్రమానికి వచ్చిన ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్, వివాదాస్పద గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు పదేళ్ల జైలుశిక్ష విధించిన రోహ్‌తక్ సీబీఐ ప్రత్యేక కోర్టు న్య

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (20:41 IST)
నమ్మి ఆశ్రమానికి వచ్చిన ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్, వివాదాస్పద గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు పదేళ్ల జైలుశిక్ష విధించిన రోహ్‌తక్ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జగ్దీప్‌సింగ్‌ను నల్లకోటు ధరించిన రియల్ హీరోగా నెటిజన్లు కొనియాడుతున్నారు. 
 
15 ఏళ్ల క్రితం నాటి అత్యాచారం కేసులో డేరా బాబాను రోహ్‌తక్‌లో సీబీఐ న్యాయస్థానం శుక్రవారం దోషిగా తేల్చగా, సోమవారం పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, గుర్మీత్‌కు కోర్టు శిక్షను ఖరారు చేసిన వెంటనే సామాజికమాధ్యమాల్లో పెద్దఎత్తున నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేశారు. 
 
గుర్మీత్‌కు ఇప్పటికైనా శిక్ష పడిందని.. నకిలీ బాబాలకు ఇదో హెచ్చరిక అంటూ పలువురు తమ ట్వీట్లలో పేర్కొన్నారు. పలువురు డేరా బాబాపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు గుర్మీత్‌కు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పిన జస్టిస్‌ జగ్దీప్‌సింగ్‌ను సూపర్‌హీరోగా కొనియాడారు. కాగా, ట్విటర్‌లో వెల్లువెత్తుతున్న పోస్టుల్లో కొన్ని.. 
 
* 'రాక్‌స్టార్‌ లవ్‌ఛార్జర్‌ ఇక మరో పదేళ్లు మనకు కనిపించడు'. 
* 'అత్యాచారం కేసులో శిక్ష ఇప్పుడు ఖరారైంది. ఇక హత్య కేసులో తీర్పు రావాలి. ఇక బాబా జీవితం జైలుకే అంకితం'. 
* 'నల్లగౌను ధరించిన సూపర్‌ హీరో ఆ న్యాయమూర్తి'.
* 'ఓ దొంగబాబాకు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఇక నకిలీ బాబాలు జాగ్రత్త. ఇది మీకో హెచ్చరిక'.
* 'కోర్టు అతనికి పదేళ్ల శిక్ష ఎందుకు విధించిందో తెలుసా..? గుర్మీత్‌కు-2 ఏళ్లు.. రామ్‌కు-2 ఏళ్లు.. రహీమ్‌కు-2 ఏళ్లు.. సింగ్‌కు-2 ఏళ్లు, బాబాకు-2 ఏళ్లు. ఒక్కో పేరుకు రెండేళ్లు'. 
* 'యే దస్‌ సాల్‌.. గుర్మీత్‌కే నామ్‌'.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram gopal varma: పుష్కరాల్లో తొక్కిసలాట భక్తులు చనిపోతే.. దేవతలను అరెస్టు చేస్తారా?

Pawan Kalyan: హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. నమ్మలేకపోతున్నానన్న రష్మిక

సంధ్య థియేటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్‌నే ఎలా బాధ్యులను చేస్తారు? నాని ప్రశ్న

డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు దినం పట్ల మనవరాళ్ళు రేవతి, అనురాధ హర్షం

వెంకటేష్ బర్త్‌డే - సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ సింగిల్ ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments