Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జల్లికట్టు పోరాట యువతకు పెద్దన్నగా లారెన్స్... రీల్ హీరో రియల్ హీరో అయ్యారు.. ఎలా?

జల్లికట్టు పోరాటంలో పాల్గొన్న వారికి ఆహారం, తాగునీరు అందజేసేందుకు కోటి రూపాయలైనా వ్యయం చేస్తానని ప్రకటించిన రీల్ హీరో రాఘవ లారెన్స్. ఈ విషయంలో ఆయన పెద్ద మనసు చాటుకోవడమే కాకుండా, జల్లికట్టు కోసం పోరాటం

జల్లికట్టు పోరాట యువతకు పెద్దన్నగా లారెన్స్... రీల్ హీరో రియల్ హీరో అయ్యారు.. ఎలా?
, శనివారం, 21 జనవరి 2017 (08:31 IST)
జల్లికట్టు పోరాటంలో పాల్గొన్న వారికి ఆహారం, తాగునీరు అందజేసేందుకు కోటి రూపాయలైనా వ్యయం చేస్తానని ప్రకటించిన రీల్ హీరో రాఘవ లారెన్స్. ఈ విషయంలో ఆయన పెద్ద మనసు చాటుకోవడమే కాకుండా, జల్లికట్టు కోసం పోరాటం చేస్తున్న యువతకు పెద్దన్నగా ముందు నిలబడ్డారు. దీంతో ఈయన ఇపుడు రియల్ హీరో అయ్యారు. 
 
గత కొన్ని రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు కోసం ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ పోరాటంలో పాల్గొనని సినీ తారలను విమర్శిస్తున్న ప్రజలు నటుడు, నృత్య ‘దర్శకుడు’ లారెన్స్‌ని మాత్రం ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. శభాష్‌ లారెన్స్ అంటూ కీర్తిస్తున్నారు. తాము చేస్తున్న పోరాటానికి చిత్తశుద్ధితో మద్ధతు తెలిపిన సినీ ప్రముఖుడు ఆయన ఒక్కరే అంటూ యువత కొనియాడుతున్నారు. 
 
ఎందుకంటే... అనారోగ్యంతో బాధపడుతూ.. ఆరోగ్యం ఏమాత్రం సహకరించక పోయినప్పటికీ.. ఆయన స్వయంగా ఈ పోరాటంలో పాల్గొని యువతకు సంఘీభావం ప్రకటించారు. అంతేనా... అనారోగ్యంతో బాధపడుతున్నా లెక్కచేయక మెడకి బ్యాండ్‌తోనే గళం విప్పారు. అయితే మూడు రోజులుగా ఆయన బాగా అలసిపోవడం, అనారోగ్యం ఇబ్బందిపెట్టడంతో సొమ్మసిల్లిపడ్డారు. 
 
శుక్రవారం ఉదయం లారెన్స్ మెరీనాబీచ్‌కు వెళ్లి ఆందోళన చేస్తున్న విద్యార్థులతోపాటు కూర్చున్నారు. 11.30గంటల సమయంలో ఆయన అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయన్ని యువకులు అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. అంబులెన్స్ సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్సలు అందజేసిన కొద్దిసేపటికి కోలుకున్నారు. ఆ తర్వాత మళ్లీ పోరాటంలో పాల్గొన్నారు. 
 
అంతేకాకుండా, ఈ ఆందోళనలో పాల్గొన్న మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించారు లారెన్స్. దీంతో మరుగుదొడ్డి సదుపాయం ఉన్న ఐదు కేరవాన్‌లను మెరీనా తీరంలో ఏర్పాటుచేయించారు. ఈ కేరవాన్‌లను ఆయన నటించిన ‘శివలింగ’ చిత్ర యూనిట్‌కి చెందినవి. ఈ చిన్న సాయం లారెన్స్‌ని పోరాటంలో పాల్గొంటున్న యువతకు పెద్దన్నని చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి, బాలయ్య.. సినిమాల్లోనేనా.. నిజజీవితంలోనూ ప్రజలకు అండగా నిల్చేదేమైనా ఉందా?