గుర్మీత్ రామ్ సింగ్ శిక్షపై హైకోర్టులో సవాల్ చేస్తాం: న్యాయవాదులు
డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు పదేళ్ల జైలు శిక్ష పడటంపై యోగాగురువు రాందేవ్ బాబా స్పందించారు. భారత దేశంలో చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు చేసిన వారు ఎవరూ చట్టం నుంచి తప్పించుకో
డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు పదేళ్ల జైలు శిక్ష పడటంపై యోగాగురువు రాందేవ్ బాబా స్పందించారు. భారత దేశంలో చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు చేసిన వారు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని కోర్టు మరోసారి రుజువు చేసిందని బాబా తెలిపారు.
రామ్‌దేవ్ బాబా ''పతంజలి'' ఉత్పత్తులకు పోటీగా "ఎంఎస్‌జీ" పేరుతో గుర్మీత్ 151కి పైగా రకాల సంప్రదాయ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ఈ ఉత్పత్తులకు పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. కాగా అత్యాచారం కేసులో పదేళ్ల శిక్షకు గురైన గుర్మీత్ రాం రహీం సింగ్ బాబాకు సీబీఐ రోహ్‌తక్ ప్రత్యేక కోర్టు విధించిన తీర్పును హైకోర్టులో సవాలు చేయనున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు.
ఈ కేసులో సీబీఐ సమగ్ర దర్యాప్తు చేయలేదని, సరైన సాక్ష్యాలు కూడా లేవని న్యాయవాదులు తెలిపారు. అంతే కాకుండా బాబా సామాజిక సేవను కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు బాబాకు న్యాయం చేస్తుందని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామన్నారు.
ఇకపోతే.. గుర్మీత్ బాబాకు శిక్ష పడినందుకు ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని డేరా సచ్ఛా సౌధా చైర్‌పర్సన్ విపాసన ఇన్సాన్, గుర్మీత్ అనుచరులకు విజ్ఞప్తి చేశారు.