Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పుడే హృదయాలను కరిగిస్తున్న బిగ్ బాస్... మధుమిత పడిపోయింది

బిగ్ బాస్ ప్రారంభ కార్యక్రమంపై నెటిజన్ల నెగటివ్ రియాక్షన్లను అలా పక్కన పెట్టండి. కానీ అది తొలి ఎపిసోడ్‌లలోనే కొందరి హృదయాలను కరిగిస్తోంది. తన భర్త తొలిసారిగా ఆ షోలో కన్నీరు కార్చడం చూసి భార్య మధుమిత కరిగిపోయింది. ఎంతో ధైర్యవంతుడైన తన భర్త అలా కన్నీరు

Advertiesment
Madhumita heart melting husband siva balaji tears in big boss
హైదరాబాద్ , బుధవారం, 19 జులై 2017 (03:41 IST)
బిగ్ బాస్ ప్రారంభ కార్యక్రమంపై నెటిజన్ల నెగటివ్ రియాక్షన్లను అలా పక్కన పెట్టండి. కానీ అది తొలి ఎపిసోడ్‌లలోనే కొందరి హృదయాలను కరిగిస్తోంది. తన భర్త తొలిసారిగా ఆ షోలో కన్నీరు కార్చడం చూసి భార్య మధుమిత కరిగిపోయింది. ఎంతో ధైర్యవంతుడైన తన భర్త అలా కన్నీరు పెట్టడం చాలా బాధించిందని ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు చాలామందిని స్పందింప చేసింది. 
 
నటుడు శివబాలాజీ, మధుమితను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షోలో పాల్గొన్న వారిలో శివబాలాజీ కూడా ఒకరు. ఈ షోలో ఓ సందర్భంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని మధుమిత సోషల్‌మీడియాలో ద్వారా గుర్తు చేసుకున్నారు. తన భర్త చాలా ధైర్యవంతుడని, అలాంటిది ఆయన కన్నీరు పెట్టుకోవడం చాలా బాధించిందని నటి మధుమిత అన్నారు. 
 
బిగ్ బాస్‌లో ఓ టాస్క్‌లో భాగంగా సహ కంటెస్టెంట్‌లు చెప్పిన వారి నిజ జీవిత సంఘటనలను విన్న శివబాలాజీ కన్నీరు పెట్టుకోవడం హృదయాన్ని కలచివేసిందని మధుమిత అన్నారు. ఇది తన భర్తలోని అరుదైన కోణమని, దాన్ని ‘బిగ్‌బాస్‌’ షో ఒక్కరోజులో బయటపెట్టిందని చెప్పారు. 
 
ఇవాళ శివబాలాజీ పంచుకోబోతోన్న ఆయన కథ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కన్నీరు పెట్టుకోవడం చూడలేనని మధుమిత తన భర్త శివబాలాజీ ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.
 
సగటు మనుషులు బిగ్ బాస్‌లో హోస్ట్‌లుగా ఉండటాన్ని కొంతమంది నెటిజన్లు, సినిమా తారలు కూడా గేలి చేయడం తెలిసిందే. కానీ  ఆ మనుషులు భావేద్వేగంతో కన్నీరు తెప్పించగల మనసున్నవారని తేలిపోయింది కదా.. కాబట్టి వారి సెలబ్రిటీ స్థాయిలను పక్కన బెట్టి వారిని గౌరవిద్దాం. వాళ్లూ మనుషులే. వాళ్లు కూడా జీవితాలను పండించగలరు. మనుషులను స్పందింపజేయగలరు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్షాన్ని చూస్తున్న అనుభూతి ఫిదా...చూసిన ఏ ఒక్కరు వ్యతిరేకించరన్న దర్శకుడు