శభాష్ తల్లీ! మృగాడికి తగిన శాస్తి చేసినందుకు కేరళ సీఎం ప్రశంసలు
అత్యాచారం చేసేందుకు యత్నించిన దొంగబాబా రహస్యాంగాన్ని కోసిపారేసిన యువతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ కూడా ఆ యువతిపై ప్రశంసలు వర్షం కురిపించారు. ఆధ్యాత్మిక ముసుగు వేసుకుని గత
అత్యాచారం చేసేందుకు యత్నించిన దొంగబాబా రహస్యాంగాన్ని కోసిపారేసిన యువతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ కూడా ఆ యువతిపై ప్రశంసలు వర్షం కురిపించారు. ఆధ్యాత్మిక ముసుగు వేసుకుని గత ఎనిమిదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న మృగాడికి తగిన శాస్తి చేసినందుకు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
'ఆమె ఎంతో ధైర్యంగా మంచి పని చేసింది.. అందులో ఎటువంటి అనుమానం లేదని' ఆయన ప్రశంసించారు. కాగా, కొల్లమ్‌లోని పన్మన ఆశ్రమానికి చెందిన స్వామి గణేశానంద తనను భక్తితో కొలుచుకుంటున్న కుటుంబానికి చెందిన యువతిపై అత్యాచారానికి ఒడిగడుతుండగా, అతని దాష్టీకాన్ని భరించలేని యువతి ఎదురుతిరిగి అతని జననాంగాన్ని కోసేసిన సంగతి తెలిసిందే.