Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు చస్తుంటే.. కోవిడ్ వ్యాక్సిన్లపై జీఎస్టీనా? రాజస్థాన్ మంత్రి

Webdunia
శనివారం, 8 మే 2021 (16:51 IST)
ఒకవైపు కరోనా వైరస్ సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా రోగుల ప్రాణాలు రక్షించే మందులపై జీఎస్టీ వసూలు చేయడం.... శవాలపై  పైసలు ఎరుకున్న చందమే అవుతుందని రాజస్థాన్‌ రాష్ట్ర మంత్రి ప్రతాప్ ఖచరియవస్ ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొవిడ్-19 వ్యాక్సిన్ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం జీఎస్టీ విధించ‌డం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం పెట్రో ధ‌ర‌ల పెంపుపై మోడీ స‌ర్కార్ కరోనా కష్టకాలంలోనూ వెనక్కి తగ్గడం లేదన్నారు.
 
దేశంలో పౌరులంద‌రికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ అందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఉచిత వ్యాక్సిన్ పొంద‌డం పౌరుల హ‌క్క‌ని.. దీనిపై ఎలాంటి చ‌ర్చ లేకుండా స‌త్వ‌ర‌మే పౌరులంద‌రికీ ఉచిత వ్యాక్సినేష‌న్ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.
 
కొవిడ్ వ్యాక్సిన్ల‌పై ప‌న్నుల భారంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌నంగా రూ.3000 కోట్లు వెచ్చించాల్సి ఉంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు ఆక్సిజన్ కొర‌త‌తో ప్రాణాలు విడుస్తుంటే కేంద్ర ప్ర‌భుత్వం ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను త‌న గుప్పిట్లోకి తీసుకుంద‌ని విమ‌ర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments