Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఇనుప గొలుసుతో కట్టేసిన భర్త..

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (08:26 IST)
ఇటీవలి కాలంలో అనుమానపు అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ అనుమానపు మొగుడు... తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని గట్టిగా నమ్మి.. ఆమెను ఇనుప గొలుసుతో కట్టేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. 
 
ఈ జిల్లాలోని లాల్‌ఘడ్ గ్రామ పంచాయతీకి చెందిన 40 ఏళ్ల వయసుగల వివాహితను భర్త ఇనుపగొలుసుతో బంధించాడు. విషయం తెలిసిన పోలీసులు వచ్చి బాధిత మహిళను గొలుసును తెంపి కాపాడారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేసేందుకు తాను పుట్టింటికి వస్తే భర్త వచ్చి తనను దారుణంగా కొట్టి, ఇంటికి తీసుకువచ్చి ఇనుపగొలుసులతో బంధించి రెండు తాళాలు వేసి వెళ్లాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తాను తన తల్లిదండ్రులకు సహాయం చేసేందుకు వస్తే తనకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి తన భర్త తనను వేధిస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళను కాపాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడైన భర్తను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments