Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రైవేట్‌ యూనివర్శిటీల జాబితాలో ప్రథమస్థానం

Advertiesment
Bharath Institute of Higher Education and Research
, సోమవారం, 28 జూన్ 2021 (18:05 IST)
చెన్నైకు చెందిన భారత్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (BIHER) భారతదేశంలోనే నెంబర్‌వన్‌ ప్రైవేట్‌ మరియు డీమ్‌డ్‌ యూనివర్శిటీగా అవతరించింది. అంతేకాకుండా యూనివర్శిటీకి చెందిన నాలుగు కార్యక్రమాలు SCImago ఇనిస్టిట్యూషన్స్‌ ర్యాంకింగ్స్- 2021లో అగ్రస్థానాన్ని సంపాదించాయి.
 
ఈ ర్యాంకింగ్స్‌ను SCImago ఇనిస్టిట్యూట్‌ ఎల్స్‌వీర్‌ భాగస్వామ్యంతో పరిశోధన చేసి ప్రచురించింది. SCImago ఇనిస్టిట్యూషన్స్‌ ర్యాంకింగ్స్‌ ప్రపంచంలోనే నెంబర్‌వన్‌ ర్యాంకింగ్స్‌. యూనివర్శిటీలు మరియు సైంటిఫిక్‌ ఆర్జనైజేషన్ల యొక్క అప్లికేషన్లను బట్టి ర్యాంకులు ఉండవు. కేవలం ప్రపంచస్థాయి ప్రమాణాలు, గత ఐదేళ్లుగా యూనివర్శిటీ యొక్క పనితీరు ఆధారంగా మాత్రమే ర్యాంకుల్ని ప్రకటిస్తారు.
 
ఈ సందర్భంగా భారత్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌  రీసెర్చ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జె. సందీప్‌ ఆనంద్‌ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… SCImago ర్యాంకింగ్స్‌ 2021 మా ఫ్యాకల్టీ మెంబర్స్‌, స్టాఫ్‌, స్కాలర్స్‌ మరియు విద్యార్థుల యొక్క ప్రతిభకు దక్కిన ప్రతిఫలం. BIHERతో అసోసియేట్‌ అయిన ప్రతీ ఒక్కరూ చాలా గర్వపడే సందర్భం ఇది. భారతీయ మరియు ప్రపంచ విశ్వవిద్యాలయాలలో అనేక అగ్రశ్రేణి ర్యాంకులను పొందడం మరియు భారతదేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో రీసెర్చ్‌లో లీడర్‌గా గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి మమ్మల్ని మరింత అద్భుతంగా పనిచేసేలా, సరికొత్త బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తుంది అని అన్నారు ఆయన.
 
ర్యాంకింగ్ ప్రధానంగా సంస్థల యొక్క పరిశోధన, విశ్లేషణ, అకడమిక్ రీసెర్చ్ అవుట్‌పుట్‌, ఆవిష్కరణ ఉత్పాదనలు మరియు సామాజిక ప్రభావం వంటి వాటి ఆధారంగా ఇస్తారు. SCImago ర్యాంకింగ్స్ 2021 లో ప్రపంచవ్యాప్తంగా 4,126 ప్రధాన ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి. చైనా నుంచి సుమారు 550 విశ్వవిద్యాలయాలు మరియు అమెరికా నుంచి 500 కి పైగా విశ్వవిద్యాలయాలు వివిధ విభాగాలలో ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నాయి.
 
అంతేకాకుండా ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ మరియు ఖగోళ శాస్త్రంలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో టాప్-ర్యాంక్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉన్న ఏకైక ప్రైవేట్ విశ్వవిద్యాలయం BIHER. భారతదేశంలో టాప్ 10 లో ఉన్న ఏకైక ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఇది.
 
SCImago ఇనిస్టిట్యూషన్స్‌ ర్యాంకింగ్ 2021 కూడా BIHER ను పరిశోధనలో అగ్రశ్రేణి భారతీయ విశ్వవిద్యాలయంగా సూచించింది. మరోవైపు రీసెర్చ్‌లో ప్రపంచంలోని 300 విశ్వవిద్యాలయాల జాబితాలో భారతదేశం నుండి ఎంపికైన ఏకైక ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా నిలిచింది BIHER.
 
డాక్టర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ… వివిధ రంగాల్లో 100 పరిశోధన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి BIHER ఇటీవల తన పరిశోధన విభాగానికి కోటి రూపాయలను మూలధనంగా కేటాయించింది.  అంతేకాకుండా లేబరేటరి మౌలిక సదుపాయాలను విస్తరించడానికి కట్టుబడి ఉంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లో మొదటిస్థానం సాధించడం ద్వారా మా వాటాదారులు మరింత విజయోత్సాహంతో పనిచేసేందుకు అవకాశం ఏర్పడింది అని అన్నారు ఆయన.
 
BIHER ఎన్నో అద్భుతాలు సాధించింది. అందులో 25,753 పబ్లికేషన్స్‌, 53,000 సిటేషన్లు, 476 పేటెంట్స్‌ ఉన్నాయి. అంతేకాకుండా దేశంలో 7 స్థానంలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కొత్తగా 2వేల కేసులు.. కర్ఫ్యూ నిబంధనలు సడలింపు