అగ్ని సిరీస్‌లో అత్యధునికమైన వేరియంట్ అయిన అగ్ని పీని భారత రక్షణ, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఇది 1,000 కిలో మీటర్ల నుంచి 2,000 కిలో మీటర్ల దూరం వరకు దూసుకపోయే సామర్థ్యం వుంది.
ఒడిశాతీరంలో ఈ ప్రయోగాలను విజయవంతంగా పరిక్షించింది. ఒడిశా తీరంలోని ఉదయం గం. 10.55లకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 'తూర్పు తీరం వెంబడి ఉన్న పలు టెలిమెట్రీ, రాడార్ స్టేషన్లు క్షిపణి ప్రయోగాలను క్షుణ్ణంగా ట్రాక్ చేసి పర్యవేక్షించాయి. క్షిపణి ఓ క్రమపద్ధతిని అనుసరించి అన్ని లక్ష్యాలను ఖచ్చితత్వంతో చేరుకుంద' డీఆర్‌డీవో ఒక ప్రకటనలో తెలిపింది.
డీఆర్‌డీవో ప్రయోగించిన అగ్ని సిరీస్‌లో 'అగ్ని పి' మొదటిది. ఈ బాలిస్టిక్ క్షిపణి.. అగ్ని 3 కన్నా 50 శాతం తక్కువ బరువు కలిగి ఉంది. దీనిని రైలు, రహదారిగుండా తీసుకపోవచ్చని, అలాగే ఎక్కవ కాలం నిల్వచేయవచ్చని తెలిపింది. అలాగే రవాణాకి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని డీఆర్‌డీవో పేర్కొంది.
అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని-పి.. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 1000 కిలోమీటర్ల నుంచి 2000 కిలో మీటర్ల మధ్య దూరానికి పైగా ఉన్న లక్ష్యాన్ని చేధించగలదు. ఇండో-పసిఫిక్‌లోని శత్రువులను టార్గెట్ చేసుకుని ప్రయోగించేందుకు వీటిని ఉపయోగించవచ్చని డీఆర్‌డీవో పేర్కొంది.
గత శుక్రవారం డీఆర్‌డీవో ఒడిశా తీరంలో చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన పినాకా రాకెట్లను కూడా విజయవంతంగా పరిక్షీంచింది. 45 కిలోమీటర్ల దూరం వరకు గల లక్ష్యాలపై దాడిచేయగల 25 పినాకా రాకెట్లను పరిక్షీంచింది.