భారత్‌లో కరోనా వైరస్ భయపెడుతోంది. ముఖ్యంగా, ఇటీవల బయటపడిన కరోనా డెల్టా ప్లస్ వైరస్ ఇతర వేరియంట్లకంటే అధికంగా ఊపిరితిత్తుల్లో కేంద్రీకృతమవుతున్నట్టు కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డా.ఎన్‌కే అరోరా తాజాగా పేర్కొన్నారు.
అయితే.. దీనివల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుందా లేదా వ్యాధి వ్యాప్తి తీవ్రమవుతుందా అనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన తెలిపారు. డెల్టా ప్లస్‌ను జున్ 11న తొలిసారిగా గుర్తించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ వేరియంట్‌ను ప్రభుత్వం ఆందోళన కారక వైరస్‌గాను గుర్తించింది.
ఈ కొత్త వేరియంట్ కారణంగా కరోనా సంక్షోభం ఏమలుపు తీసుకుంటందనేది తెలియాలంటే ఈ తరహాకేసులు మరిన్ని వెలుగులోకి రావాలని డా.ఆరోరా పేర్కొన్నారు. 'పరిస్థితులను నిశితంగా గమనిస్తూ.. వైరస్ వ్యాప్తిని విశ్లేషించాలి. అప్పుడే ఈ వేరియంట్‌కున్న వ్యాప్తి సామర్థ్యం ఎంతడిదో అంచనా వేయచ్చు' అని తెలిపారు.