వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్.. టెస్టింగ్ దశలో వ్యూ వన్స్

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (08:15 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ త్వరలోనే రాబోతోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ పేరు 'వ్యూ వన్స్'. యూజర్లు పంపిన ఫొటోలు, వీడియోలు ఒకసారి చూసిన తర్వాత వాటంతట అవే మాయమైపోతాయి. 
 
బీటా టెస్టర్ల కోసం ఆండ్రాయిడ్ 2.21.14.3 వెర్షన్‌లో అందుబాటులో వుందని వాట్సాప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిసప్పియరింగ్ మెసేజెస్‌లానే ఇది కూడా పనిచేస్తుంది. గతేడాది నవంబరులో డిసప్పియరింగ్ మెసేజ్ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
అయితే, వ్యూ వన్స్ ఫీచర్‌లో టైం పిరియడ్ అంటూ ఏమీ ఉండదు. ఫొటోలు కానీ, వీడియోలను కానీ ఒకసారి చూసిన తర్వాత వాటంతట అవే మాయమైపోతాయి. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయంలో ఇప్పటి వరకు వాట్సాప్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments