Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ఉండగా ఇంటికొచ్చిన భర్త.. ప్రియుడిని కూలర్‌లో దాచిన భార్య.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (16:16 IST)
కొందరు భార్యాభర్తలు క్షణిక సుఖం కోసం చేసే పాడు పనులు తమ కాపురాల్లో చిచ్చు కొని తెచ్చుకుంటున్నారు. ఈ కోవలోనే అర్థరాత్రి పూట తన ఇంట్లోనే ప్రియుడితో వివాహిత ఉన్న సమయంలో భర్త ఉన్నట్టుండి వచ్చాడు. దీంతో ఏం చేయాలో తెలియక తన ప్రియుడిని ఆమె కూలర్‌లో దాచిపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజస్థాన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌‍ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని పడక సుఖం పొందుతూ వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పలిపించుకుంది. అయితే, వారిద్దరూ పడక గదిలో ఎంజాయ్ చేశారు. ఇంతలో ఉన్నట్టుండి కట్టుకున్న భర్త ఇంటికి వచ్చాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆమె... తన ప్రియుడిని కూలర్‌లో దాచిపెట్టింది. 
 
అప్పటికే భార్యపై అనుమానంతో ఉన్న భర్త.. ఇంట్లోకి రాగానే మొత్తం గాలించాడు. ఇలా చివరకు కూలర్‌ను వెనక్కి తిప్పి చూడగా, అందులో ఆ వ్యక్తి దాకి వుండటం చూశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిపోవడంతో భార్య తెల్లమొఖం పెట్టింది. 
 
అప్పటికీ తన తప్పేమీ లేనట్లుగా ప్రవర్తించింది. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 'ఇలాంటి వారి వల్ల కాపురాలు నాశనమవుతున్నాయ్'.. అని కొందరు, 'వివాహేతర సంబంధాలు.. ఎప్పటికైనా బయటపడక తప్పదు'.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments