Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు దక్కనిది మరొకరికి దక్కకూడదు.. ప్రియురాలిని 10 సార్లు కత్తితో పొడిచి..

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (13:52 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని 10 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కడానికి వీల్లేదన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం జోధ్‌పూర్ రాష్ట్రంలో మంగళవారం జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజ‌స్థాన్ పాలి జిల్లాకు చెందిన ల‌క్షిత‌ అనే విద్యార్థిని న్యాయ విద్య‌ను అభ్య‌సిస్తోంది. నాగౌర్ జిల్లాలో బ‌ట్ట‌ల వ్యాపారం చేస్తూ జీవ‌నం కొన‌సాగిస్తున్న హేమంత్‌ అనే యువకుడితో ల‌క్షిత‌కు ప‌రిచ‌యం ఏర్పడింది. 
 
ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా ఐదేళ్ళపాటు ల‌క్షిత‌, హేమంత్‌లో ప్రేమలో ఉన్నారు.కానీ ల‌క్షిత‌కు ఏడు రోజుల క్రితం మ‌రో యువ‌కుడితో నిశ్చితార్ధం జ‌రిగింది. త‌న ప్రియురాలికి మ‌రొక‌రితో వివాహం జ‌రుగుతంద‌ని తెలియ‌డంతో హేమంత్ జీర్ణించుకోలేకపోయాడు.
 
ఆ వెంటనే సోమ‌వారం రాత్రి ల‌క్షిత‌ను జోధ్‌పూర్‌లోని ఓ హోట‌ల్‌కు హేమంత్ పిలిపించాడు. ఆ రోజు రాత్రి ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. త‌న‌కు ద‌క్క‌ని ల‌క్షిత వేరే వారికి ద‌క్కొద్ద‌నే ఉద్దేశంతో.. ఆమెపై క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. ఆమె శ‌రీరంపై 10 చోట్ల క‌త్తితో పొడిచాడు. 
 
ఆ త‌ర్వాత తాను కూడా బ‌య‌ట‌కు వెళ్లి.. స‌మీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. హేమంత్ శ‌రీరంపై నుంచి రైలు దూసుకెళ్ల‌డంతో.. శ‌రీరం రెండు ముక్క‌లైంది. ల‌క్షిత‌, హేమంత్ మృత‌దేహాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments