రాఫెల్ స్కామ్ : మనోహర్ పారీకర్‌తో రాహుల్ భేటీ... మోడీకి వెన్నులో వణుకు!

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (16:15 IST)
దేశరాజకీయాలను ఓ కుదుపు కుదిపిన స్కామ్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు. ఈ విమానాల కొనుగోలులో వేల కోట్ల రూపాయల మేరకు అవినీతి చోటుచేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిని అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, రాఫెల్ డీల్‌కు సంబంధించిన సీక్రెట్స్ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ వద్ద ఉన్నాయంటూ గతంలో రాహుల్ ఆరోపించారు. 
 
ఈ నేపథ్యంలో మనోహన్ పారికర్‌తో రాహుల్ గాంధీ మంగళవారం సమావేశం కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత పనుల నిమిత్తం గోవాకు వెళ్లిన రాహుల్... విధానసభ పరిసరాల్లో పారికర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పారికర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రాహుల్ వెల్లడించారు.
 
'ఈ ఉదయం గోవా ముఖ్యమంత్రి పారికర్‌ను కలుసుకున్నాను. అనారోగ్యం నుంచి ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. ఈ మధ్యాహ్నం కేరళ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో నేను మాట్లాడబోతున్నా. దీనికి సంబంధించి నా ఫేస్‌బుక్ పేజ్‌లో లైవ్ చూడవచ్చు' అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, మనోహర్ పారికర్ పాంక్రియాస్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. మరోవైపు, రాఫెల్ డీల్‌కు సంబంధించిన ఫైళ్లు పారికర్ వద్ద ఉన్నాయంటూ రాహుల్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారానికి సంబంధించి బాంబులాంటి ఫైళ్లు పారికర్ దగ్గర ఉన్నాయని చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సైతం పారికర్ పేరును ప్రస్తావించి సభలో రాహుల్ కలకలం రేపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments