అమ్మ - నానమ్మ గుణాలు ఉంటే ఓకే... జీవిత భాగస్వామిపై రాహుల్

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (11:04 IST)
తనకు కాబోయే జీవిత భాగస్వామి గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన మనస్సులోని మాటను వెల్లడించారు. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పారు. తన తల్లి సోనియా గాంధీ, నానమ్మ ఇందిరాగాంధీ గుణాలు, లక్షణాలు కలగలిసిన మహిళ జీవిత భాగస్వామిగా వస్తే బాగుంటుందని చెప్పారు.
 
తాను కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్రలో భాగంగా, ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన జీవిత భాగస్వామి గురించి వెల్లడించారు. తన నానమ్మ ఇందిరా గాంధీ అంటే తనకు అత్యంత ఇష్టమైన మహిళ అని, మరో తల్లి లాంటిదన్నారు. అయితే, ఇందిరా గాంధీ లక్షణాలు ఉండాలి. కానీ మా అమ్మ, నానమ్మ లక్షణాలు కలగలిసిన మహిళ అయితే మంచిది అన్నారు. 
 
అలాగే, కొందరు బీజేపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, తనను చూస్తే వారికి భయమన్నారు. అందుకే తనను పప్పు అని నానా రకాలుగా విమర్శిలు చేస్తుంటారని, వాటిని అస్సలు పట్టించుకోనని చెప్పారు. పైగా అది పెద్ద విషయం కాదన్నారు. తిట్టినా, కొట్టినా నేను పెద్దగా పట్టించుకోను. ద్వేషించను అని అన్నారు. పప్పు అనడంపై ఆయన స్పందిస్తూ అదో రకమైన దుష్ప్రచారం అన్నారు. అలా పిలిచేవారికి అంతర్లీనంగా భయం ఉంటుందని చెప్పారు. ఎంత తిడితే అంత సంతోషిస్తా. నాకు మరిన్ని పేర్లు పెట్టండి. అస్సలు పట్టించుకోను. ప్రశాంతంగా ఉంటా అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments